Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతున్నారా? అందుకే సరిగ్గా తినకుండా పొట్టను పస్తులు ఉంచుతున్నారా? బరువు తగ్గడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేసి విసిగిపోయి ఉంటారు. అయినా కొందరు బరువు తగ్గాలి అనుకుంటారు కానీ సరైన ఆహారాన్ని మాత్రం ఎంచుకోరు. ఉదయం వాకింగ్, వ్యాయామం చేస్తూ ఫుల్ గా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. ఇందులో డౌటే లేదు. మీ డైట్ ను ఎంత బెటర్ గా ప్లాన్ చేసుకుంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. మరి ఈ బరువుకు పులిస్టాప్ పెట్టడానికి ఈ క్రింది బ్రేక్ ఫాస్ట్ ను తీసుకుంటే ఎక్కువ బరువు పెరగకుండా ఉంటారు. క్యాలరీలు సరైన మోతాదులో అందుతూనే కడుపు నిండుగా ఉంచుతాయి ఈ బ్రేక్ ఫాస్ట్ లు. అందుకే ఈ ఆహారాన్ని తీసుకొని బరువు తగ్గించుకోండి. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా? ఓ సారి చూసేయండి.
హెల్దీ బ్రేక్ ఫాస్ట్ వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. శరీరానికి సరిపడా ఖనిజాలు, ప్రోటీన్స్ లు ఉత్పత్తి అవుతాయి. తద్వారా బరువు తగ్గవచ్చు. రోజూ ఉదయం గ్లాస్ వాటర్ లో నిమ్మరసం పిండి ఉప్పు పంచదార లేకుండా చిటికెడు వాము వేసుకొని తాగాలి. ఇది బాడీలో కొలెస్ట్రాలను కరిగిస్తుంది.
బరువును తగ్గించే బ్రేక్ ఫస్ట్ లు :-
గ్రెయిన్స్ :- బరువు తగ్గాలనుకునేవారు హోల్ గ్రెయిన్స్ తినవచ్చు. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. బార్లీ, గోధుమలలో కూడా పీచు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి బాడీలో క్యాలరీలను తక్కువ చేస్తుంది.
ఓట్స్ :- ఓట్స్ కు క్యాలరీలను తగ్గించడానికి మొదటి స్థానం ఇవ్వవచ్చు. ఓట్స్ లో తక్కువ క్యాలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఓట్స్ సోయా మిల్క్ తో, ఫ్యాట్ మిల్క్ తో కలిపి ప్రిపేర్ చేస్తే ప్రోటీన్స్ అందుతాయి.
ఏగ్స్ :-మార్నింగ్ ప్రోటీన్స్ అందిచడం ముఖ్యం. గుడ్లలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. గుడ్డు తెల్లసొన లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. దీని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం మంచిది. గుడ్డుసొనలో ఫైబర్ కోసం ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు యాడ్ చేస్తే బ్యాలెన్స్ డ్ బ్రేక్ ఫస్ట్ అవుతుంది. ఆకలి తగ్గి, క్యాలరీలు తగ్గి, బరువు తగ్గుతుంది.
గ్రీన్ టీ :-తొందరగా బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం బెస్ట్. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనితో కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది. గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది. వీటితో పాటు అరటిపండు తీసుకోవడం వలన పొటాషియం, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా వెయిట్ లాస్ కి సహాయం చేస్తాయి.
పెరుగు :-పెరుగును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం చాలా మంచిది. పెరుగులో ప్రోబయోటిక్ అనే మంచి బ్యాక్టీరియా లు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచి జీర్ణ వ్యవస్థలో సమస్యలు లేకుండా చేస్తుంది. అంతేకాదు ఇది క్యాలరీలను తగ్గించి బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది.
మొలకలు: మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు గుప్పెడు మొలకలను తింటే మీకు కావాల్సిన ప్రోటీన్లు, ఖనిజాలు లభిస్తాయి. మిక్సింగ్ లేదా పెసల్లు, శనగలు, పల్లీలు వంటివి నానబెట్టి సాయంత్రం ఒక క్లాత్ లో కడితే ఉదయం వరకు మొలకలు వస్తాయి. వాటిని మీ బ్రేక్ ఫాస్ట్ గా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ మీకు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను తెచ్చి ఎక్కువగా తినకుండా కూడా చేస్తుంది. తద్వారా బరువు కూడా పెరగరు అంటున్నారు నిపుణులు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: If you want to lose weight include these breakfasts in your diet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com