
మనలో చాలామంది వయస్సు పెరిగినా వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం వల్ల కొంతమంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సాధారణంగా అమ్మాయిలు 18 సంవత్సరాల వరకు అబ్బాయిలు 20 సంవత్సరాల వరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వయస్సు తరువాత హైట్ పెరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది మాత్రమే ఎత్తు పెరుగుతారు.
Also Read: ఏసీ వాడుతున్నారా.. విద్యుత్ బిల్లు ఆదా చేసే చిట్కాలివే..?
సాధారణంగా హైట్ అనేది శరీరంలోని జన్యువులపై ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో తక్కువ హైట్ ఉన్నవాళ్లు ఉంటే మిగిలిన వాళ్లు కూడా హైట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్ల లోపం, గ్రోత్ ప్లేట్స్ పెరగడం ఆగిపోవడం వల్ల కూడా హైట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే టీనేజ్ తరువాత కూడా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సులభంగా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read: బరువు తగ్గేందుకు కొత్త విధానం.. తీసుకోవాల్సిన ఆహారాలివే..?
టీనేజ్ వయస్సు దాటిన తరువాత కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా సులభంగా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకున్నా, మొలకెత్తిన విత్తనాలను తీసుకున్నా హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్లు డెస్క్ దగ్గర ఎక్కువ సమయం నిటారుగా కూర్చోవడం వల్ల పొడవు పెరిగే అవకాశాలు ఉంటాయి.
శరీరానికి, మనస్సుకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే యోగా చేయడం వల్ల కండరాలకు బలం వచ్చి ఫిట్ నెస్ డ్రెస్సులు వేసుకున్న సమయంలో హైట్ గా కనిపించే అవకాశాలు ఉంటాయి. విటమిన్ డీ, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడంతో పాటు వైద్యుల సలహాలను, సూచనలను పాటించడం ద్వారా సులభంగా హైట్ పెరగవచ్చు.
Comments are closed.