https://oktelugu.com/

Biryani: రెస్టారెంట్ కువెళ్లి బిర్యాణీ తినాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి

Biryani: ఇంట్లో ఎంత బాగా చేసినా చాలా మంది హోటల్ తిండికే అలవాటు పడుతుంటారు. ఇక బిర్యాణీ అయితే చెప్పలేం. లొట్టలేసుకుంటూ రెస్టారెంట్ల వైపు పరుగులు పెడతారు. అక్కడ దొరికే బిర్యాణీ బాగుంటుందని వారి నమ్మకం. అందుకే హోటళ్లు, రెస్టారెంట్లు అంతలా కళకళలాడతాయి. వినియోగదారులతో సందడిగా ఉంటాయి. ఇక ఆదివారం అయితే చెప్పలేం. ప్రతి వారికి బిర్యాణీ ఉండాల్సిందే. అది కూడా ఇంట్లో కాదు రెస్టారెంట్లోనే తినాలని నోరు వెళ్లబెట్టుకుని మరీ వెళతారు. వారు ఏది పెట్టినా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 24, 2023 / 11:09 AM IST
    Follow us on

    Biryani

    Biryani: ఇంట్లో ఎంత బాగా చేసినా చాలా మంది హోటల్ తిండికే అలవాటు పడుతుంటారు. ఇక బిర్యాణీ అయితే చెప్పలేం. లొట్టలేసుకుంటూ రెస్టారెంట్ల వైపు పరుగులు పెడతారు. అక్కడ దొరికే బిర్యాణీ బాగుంటుందని వారి నమ్మకం. అందుకే హోటళ్లు, రెస్టారెంట్లు అంతలా కళకళలాడతాయి. వినియోగదారులతో సందడిగా ఉంటాయి. ఇక ఆదివారం అయితే చెప్పలేం. ప్రతి వారికి బిర్యాణీ ఉండాల్సిందే. అది కూడా ఇంట్లో కాదు రెస్టారెంట్లోనే తినాలని నోరు వెళ్లబెట్టుకుని మరీ వెళతారు. వారు ఏది పెట్టినా ఇష్టంగా తింటారు. అదే ఇంట్లో అయితే ఇట్ల ఉంది అట్ల ఉంది అని పేర్లు పెడతారు.

    తాజాగా సిద్దిపేటలో ఓ వినియోగదారుడు బిర్యాణీ తిందామని రెస్టారెంట్ కు వెళ్లాడు. బిర్యాణీ ఆర్డర్ చేశాడు. ఇక సమయం అవుతుంది కదా అని టాయ్ లెట్ కు వెళ్లాడు. అక్కడ సీన్ చూసి నిర్ఘాంతపోయాడు. టాయిలెట్ లో బియ్యం కడుగుతున్నారు. వారి నిర్వాకం చూసి ఆశ్చర్యపోయాడు. అనంతరం తేరుకుని ఏంటని అడిగాడు. బియ్యం టాయిలెట్లో కడుగుతారా? అని నిలదీశాడు.

    Biryani

    దీనికి వారు చెప్పే సమాధానం సిల్లీగా ఉంది. వంటింట్లో మోటర్ చెడిపోయింది. అందుకే ఇక్కడ కడుగుతున్నాం. అయితే మాత్రం మరీ టాయిలెట్లో కడిగితే ఎలా అని మండిపడ్డాడు. మాకు బుద్ధి లేకనే రెస్టారెంట్ కు వస్తున్నామని వారిని నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా రెస్టారెంట్ వాళ్లు ఇష్టారాజ్యంగా బియ్యం కూడా టాయిలెట్లో కడిగితే మనకు వాంతులు రావడం తప్ప ఇంకేమైనా ఉందా?

    దీంతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. మనం ఎంతో పసందుగా తినే బిర్యాణీ తయారు చేయడానికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అని నెటిజన్లు మండిపుతున్నారు. ఇక మీదట మీరు రెస్టారెంట్ కు వెళితే జాగ్రత్త. బియ్యం ఎక్కడ కడుగుతున్నారో తెలిస్తే షాకే మరి. ఇంత దారుణంగా ప్రవర్తించడంపై అందరిలో అనుమానాలు పెరుగుతున్నాయి. మరీ ఇంత దిగజారిపోయి టాయిలెట్లో బియ్యం కడగడంపై ఫైర్ అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త సుమా. బిర్యాణీ కోరికను అణచుకోండి. కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకోండి. కానీ రెస్టారెంట్లకు వెళ్లి అనుమానాలు పెట్టుకోకండి.