Home Remedies For Hangover: మనదేశంలో మద్యం విపరీతంగా తాగుతుంటారు. మద్యం బాటిళ్ల మీదే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ వేసి మరీ అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోంది. ఇబ్బడిముబ్బడిగా తాగుతున్నారు. లెక్కకు మించి మందు తాగుతున్నారు. వర్షాకాలంలో సాధారణంగా మబ్బు పడుతుంది. దీంతో చలి వేస్తోందనే సాకుతో మద్యం లాగించేస్తుంటారు. ఎండాకాలంలో బీర్లు తాగుతుంటారు. వర్షాకాలంలో విస్కీ ఎక్కువగా తాగడం సహజం.
అర్థరాత్రి పార్టీలు
చలి పేరు చెప్పి మన వారు మద్యం అదుపు లేకుండా తాగుతున్నారు. తరువాత హ్యాంగోవర్ కావడంతో ఏం చేయాలో తెలియక తికమకపడుతుంటారు. అర్థరాత్రి సమయంలో పార్టీల పేరుతో ఫుల్ గా మద్యం తాగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో మన ప్రభుత్వాలకు మద్యం ద్వారా భారీ ఆదాయమే వస్తోంది. దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడినా తమ ఖజానా నింపుకోవడానికే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరి హ్యాంగోవర్ నుంచి తప్పించుకునే చిట్కాలేంటో తెలుసా.
హ్యాంగోవర్ నియంత్రణకు..
హ్యాంగోవర్ ఉన్నప్పుడు కషాయం వంటివి తాగడం ఉత్తమం. చంకలో నిమ్మకాయ రుద్దుకుంటే హ్యాంగోవర్ నుంచి తప్పించుకోవచ్చు. మంచి అల్పాహారం తీసుకుంటే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణకు వికారం, అలసట, బలహీనత వంటివి తగ్గుతాయి. హ్యాంగోవర్ తగ్గాలంటే గుడ్డు తినాలని చెబుతుంటారు. గుడ్డులో ఉండే సిస్టీన్ అనే అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల హ్యాంగోవర్ సమస్య నుంచి దూరం కావచ్చు.
సుఖమైన నిద్రపోవాలి
రాత్రి పూట ఎక్కువగా మద్యం తాగుతుంటారు. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర సరిగా పోతే హ్యాంగోవర్ సమస్య రాకుండా ఉంటుంది. హ్యాంగోవర్ నుంచి బయట పడాలంటే సుఖమైన నిద్ర ఎంతో అవసరం. ఎక్కువ సేపు నిద్ర పోకపోతే హ్యాంగోవర్ సమస్య వెంటాడుతుంది. ఇలా మనకు హ్యాంగోవర్ ను దూరం చేసుకోవాలంటే అది నిద్రతో కూడా సాధ్యమే.
శరీరం డీ హైడ్రేడ్ కాకుండా..
శరీరంలో అల్కాహాల్ ను దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మద్యం తాగినప్పుడు మూత్రం కూడా ఎక్కువగా వస్తుంది. దీని వల్ల బాడీ డీ హైడ్రేట్ కు గురవుతుంది. ఈ సమయంలో మంచినీళ్లు ఉంటేనే డీ హైడ్రేడ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. పండ్ల రసాలు తాగితే ఇంకా మేలు కలుగుతుంది.