Homeలైఫ్ స్టైల్Blood Donation: మీకు బ్లడ్‌ అత్యవసరమా.. అయితే వీరిని సంప్రదించండి

Blood Donation: మీకు బ్లడ్‌ అత్యవసరమా.. అయితే వీరిని సంప్రదించండి

Blood Donation: ప్రస్తుత కాలంలో యాక్సిడెంట్లు కామన్‌ అయ్యాయి. అందుకే ప్రభుత్వం ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర చికిత్స కోసం ఈ యూనిట్‌లు ఉపయోగపడుతున్నాయి. క్రిటికల్‌ యూనిట్‌ లేక చాలా మంది మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఎంత ముఖ్యమో బ్లడ్‌ బ్యాంకు కూడా అంతే ముఖ్యం. ఈమేరకు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వం బ్లడ్‌ బ్యాంకులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ కొన్ని ఆస్పత్రుల్లో ఇంకా ఏర్పాటు కాలేదు. మరోవైపు అత్యవసర సమయాల్లో బ్లడ్‌ డొనేట్‌ చేయడానికి దాతలు దొరకడం లేదు. దీంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.

ఇలా చేయండి..
అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే.. దాతలు దొరకని సమయంలో ఫ్రెండ్స్‌ 2 సపోర్ట్‌.ఓఆర్జీ(https://www.friends2support.org/) వెబ్‌సైట్‌ను సంద్రిస్తే ఫలితం ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో బ్లడ్‌ డొనేట్‌ చేసేవారి వివరాలు అందుబాటులో ఉంటాయి. వాళ్ల ఫోన్‌ నంబర్లు కూడా పేర్కొంటారు. ఈ సైట్‌ ఒపెన్‌ చేసి బాధితుల రక్తం గ్రూప్‌కు సరిపోయే దాతల నంబర్‌ తీసుకుని వెంటనే ఫోన్‌చేసి రక్తం కావాలని అడగవచ్చు.

సైట్‌లో ఇలా..
ఇక ఫ్రెండ్స్‌ 2 సపోర్ట్‌.ఓఆర్జీ సైట్‌ ఓపెన్‌ చేయగానే పైన మనకు అవసరమైన గ్రూప్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత దేశం పేరు భారత్‌ అని పేర్కొనాలి. తర్వాత రాష్ట్రం పేరు ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఏ జిల్లానో కూడా సైట్‌లో మెన్షన్‌ చేయాలి. తర్వాత నగరం లేదా పట్టణం పేరు తెలియజేయాలి. అన్ని ఆప్షన్లు ఎంపిక చేసిన తర్వాత సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే అందుబాటులో, దగ్గరలో ఉండే దాతల నంబర్లు కనిపిస్తాయి.

దానం చేయడానికే నమోదు..
ఇక సైట్‌లో నంబర్‌ దొరికినా ఫోన్‌ చేయడానికి చాలా మంది మొహమాట పడుతున్నారు. కానీ, ఈ సైట్‌లో ఉన్న దాతల నంబర్లు అన్నీ వారు స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నవే. రక్తం దానం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నవారే. అవసరం ఉన్నవారు అడగగానే దానం చేయడానికి ముందుకు వస్తారు. రక్తదానంతో ప్రాణదానం చేస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular