https://oktelugu.com/

Naphthalene Balls : ఇవి ఉంటే చాలు మీ ఇంట్లో ఇక చింత అక్కర్లేదు

Naphthalene Balls : నాప్లలీన్ బాల్స్ అంటే డాంబర్ గోళీలు. వీటిని ఎక్కువగా బట్టల దుకాణాల్లో వాడుతుంటారు. ఇవి బట్టల మధ్య ఉంచితే ఎలుకలు, క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి. లేకపోతే బట్టలు కీటకాల వశమవుతాయి. నాప్తలీన్ బాల్స్ తో క్లీనింగ్ లిక్విడ్ ను తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. నాప్లలీన్ లిక్విడ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే మనం ఇంట్లోనే ఉత్పత్తి చేసుకుని వాడుకోవచ్చు. ఇలా మనం స్వయంగా తయారు చేసుకుంటే […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 1, 2023 / 09:53 AM IST
    Follow us on


    Naphthalene Balls : నాప్లలీన్ బాల్స్ అంటే డాంబర్ గోళీలు. వీటిని ఎక్కువగా బట్టల దుకాణాల్లో వాడుతుంటారు. ఇవి బట్టల మధ్య ఉంచితే ఎలుకలు, క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి. లేకపోతే బట్టలు కీటకాల వశమవుతాయి. నాప్తలీన్ బాల్స్ తో క్లీనింగ్ లిక్విడ్ ను తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. నాప్లలీన్ లిక్విడ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే మనం ఇంట్లోనే ఉత్పత్తి చేసుకుని వాడుకోవచ్చు. ఇలా మనం స్వయంగా తయారు చేసుకుంటే మనకు ఖర్చు ఉండదు.

    ఒక 6 లేదా 7 నాప్తలీన్ బాల్స్ ను తీసుకుని మెత్తగా పొడి చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో నీళ్లు పోసి కలపాలి. ఇందులో ఒక మూత డెటాల్ వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల వంట సోడా వేసి కలుపుకోవాలి. తరువాత ఇందులో పావు కప్పు వెనిగర్ ను వేసుకోవాలి. ఈ లిక్విడ్ ను ప్లాస్టిక్ బాటిల్ లో వేసి నిల్వ చేసుకోవాలి. దీన్ని నీటిలో వేసి ఇల్లు శుభ్రపరచుకోవచ్చు. టాయిలెట్ ను కూడా బాగు చేసుకోవచ్చు. ఇలా నాప్తలీన్ బాల్స్ తో తయారు చేసుకునే లిక్విడ్ తో ఇంటిని శుభ్రం చేసుకుంటే క్రిములు లేకుండా పోతాయి.

    దీంతో టైల్స్ తెల్లగా మారుతాయి. ఇంట్లో మంచి సువాసన వస్తుంది. బొద్దింకలు రాకుండా చేస్తుంది. చెడు వాసన మన ముక్కును తాకకుండా చేస్తుంది. ఈ లిక్విడ్ లో దూదిని ముంచి స్టవ్, సింక్ ను శుభ్రం చేసుకోవచ్చు. బయట లిక్విడ్ ను కొనుగోలు చేసి పని లేకుండా నాప్తలీన్ బాల్స్ తో లిక్విడ్ తో తయారు చేసుకుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నాప్తలీన్ బాల్స్ తో మనం లిక్విడ్ ను తయారు చేసుకుంటే ఎన్నో మంచి లాభాలు రావడం ఖాయం.

    నాప్తలీన్ బాల్స్ బట్టల్లో పెట్టుకుంటే బొద్దింకలు రాకుండా చేస్తాయి. బట్టల దుకాణాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంకా వీటితో ఎన్నో రకాల పద్ధతుల్లో టాయిలెట్, సింక్ లను శుభ్రం చేసుకునేందుకు ఉపయోంచేందుకు మందులా పనిచేస్తాయి. ఇలా మన ఇల్లును శుభ్రం చేసుకోవడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. ఏవో ఇంగ్లిష్ మందులు కాకుండా మనం సొంతంగా తయారు చేసుకునే వాటి వల్ల ఎలాంటి ఎఫెక్టులు ఉండవు. అందుకే ఇంట్లోనే మన కిచెన్, టాయిలెట్లు శుభ్రం చేసుకునే లిక్విడ్ ను తయారు చేసుకోవడం మంచిదే.