Road Side Food : బిజీలైఫ్‌కి అలవాటు పడి ఈరోజుల్లో చాలామంది బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. తీరిక లేక ఇంట్లో వండుకోవడమే మానేస్తున్నారు. దీంతో ఎంతో అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇంట్లో వండిన అయితే కొందరికి అసలు టేస్ట్ అనిపించదు. అదే బయట ఫుడ్ ఎలా ఉన్నా కూడా తినేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా బయట ఫుడ్ అంటేనే ఇష్టం చూపిస్తారు. ముఖ్యంగా జంక్ ఫుడ్‌కి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాయంత్రం అయితే చాలు.. తప్పకుండా ఫాస్ట్‌ఫుడ్ తింటారు. ఇవి లభించే ప్లేస్‌లు కూడా అంత మంచిగా ఉండవు. అయిన తినడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఎక్కువగా తింటారు. ఈ సీజన్‌లో వీటిని అతిగా తినడం వల్ల వైరల్ ఫీవర్లు వంటివి వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల శరీరం అనారోగ్య సమస్యలకు గురవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగీ, విరేచనాలు, కలరా వంటి వైరల్ ఫీవర్లు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మేలు. బయట ఫుడ్స్‌లో అధికంగా ఉప్పు, మసాలా, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోకి వెళ్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల ఆకస్మిక మరణం కూడా సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచిగా ఉండాలని కెమికల్స్, రంగులు వంటివ ఫుడ్‌లో కలుపుతారు. వీటివల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ జంక్ ఫుడ్స్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు, రక్తనాళాల్లో పూడికలు వంటివి ఏర్పడుతున్నాయి. పిల్లలకు అయితే ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు. ఇందులో హానికరమైన కొవ్వులు ఉంటాయి. వీటివల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. అలాగే మూత్రపిండాలపై ఒత్తిడికి దారితీసి దాని పనితీరును తగ్గిస్తుంది.
ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. దీంతో ఎక్కువగా బరువు పెరుగుతారు. ఈ ఫుడ్స్ వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా వస్తుంది. వీటిలో మినరల్స్, ప్రొటీన్స్ తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి ఎలాంటి బలం ఉండదు. నీరసం అయిపోతారు. అలాగే మధుమేహం, ఊబకాయం, హైబీపీ వంటి వ్యాధుల బారిన కూడా పడతారు. బాడీ చాలా వీక్ అయిపోయి రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో జ్వరం, తలనొప్పితో పాటు డెంగీ, మలేరియా వంటివి వస్తాయి. అలాగే వీటిని డైలీ తినడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేగు క్యాన్సర్ వస్తుందని వైద్యులు అంటున్నారు. వీలైనంత తినకపోతే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.