పూర్వకాలంలో భోజనం చేయాలంటే ఎన్నో నియమాలు, పద్ధతులను పాటించేవారు. ఆ విధంగా పద్ధతులను పాటించి భోజనం చేయడం వల్ల మనం తినే ఆహారం మన శరీరానికి పడుతుందని పెద్దవారు చెబుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు టీవీలు లేదా సెల్ ఫోన్ లకు పరిమితమవుతూ భోజనం చేస్తుంటారు. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు మంచాల పై కూర్చొని భోజనం చేస్తుంటారు. ఈ విధంగా భోజనం చేయడం వల్ల పరమ దరిద్రం అని పండితులు చెబుతున్నారు. సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపిణి అయిన అన్నాన్ని తినేటప్పుడు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. అయితే భోజనం చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: కొబ్బరి నూనెతో సులభంగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?
భోజనానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తూర్పు లేదా ఉత్తరం దిక్కున కూర్చుని భోజనం చేయాలి. భోజనం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చిన మధ్యలో పైకి లేయకూడడు. అదేవిధంగా ఎంగిలి చేతితో ఎటువంటి ఆహార పదార్థాలను కూడా వడ్డించు కోకూడదు. నిలబడి అన్నం తినే అలవాటు ఉన్న వారు క్రమంగా దరిద్రులుగా మారుతారు. కొందరు అన్నం తింటూ ఆహార పదార్థాలు బాగా లేవని దూషిస్తుంటారు. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు కంచాన్ని ఎప్పుడూ కూడా వడిలో పెట్టుకుని భోజనం చేయకూడదు.
Also Read: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజాలివే..?
కొందరు భోజనం చేసేటప్పుడు గిన్నెలని పూర్తిగా ఖాళీ చేస్తూ నాకేస్తున్నట్లు తింటారు. ఒకసారి వండిన ఆహార పదార్థాలను మరి మరి వేడి చేస్తూ తినడం వల్ల ఆహారానికి ద్విపాక దోషం వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఆ అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ భోజనం చేయాలి. ఆ విధంగా భోజనం చేసినప్పుడు మనం తీసుకునే ఆహారం మన శరీరానికి పడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: If you eat like that you are extremely poor and if you do this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com