Telugu News » Health » If you are eating these ingredients during the rainy season you are in danger
Rainy season : వర్షాకాలంలో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే!
సీజన్ బాగులేకపోయిన అన్ని పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు వచ్చి.. మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Written By:
Srinivas , Updated On : September 11, 2024 / 02:21 AM IST
Rainy season
Follow us on
Rainy season: వర్షాకాలంలో ఎక్కువ శాతం మందికి జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సమస్యలు తప్పవు. అయితే వర్షాకాలంలో తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే వర్షాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కొందరు ఫుడ్ విషయంలో కంట్రోల్ ఉండకుండా అన్ని పదార్థాలను తినేస్తారు. సీజన్ బాగులేకపోయిన అన్ని పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు వచ్చి.. మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
వేపుడు పదార్థాలు
వర్షాకాలంలో వేపుడు కూరలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో తేమ పెరిగి జర్నీ వేసే పనితీరు సరిగా ఉండదు. దీంతో వేపుడు కూరలు తింటే ఇంకా జీర్ణ క్రియ సక్రమంగా పనిచేయదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి
స్ట్రీట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి
వాతావరణం మారితే.. చాలామందికి ఏదయినా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. దీంతో వేలు వర్షాకాలం ఎక్కువగా చాట్, పానీ పూరి, బజ్జీలు, నూడిల్స్ వంటివి తినడానికి ఇష్టపడతారు. వీటిని శుభ్రంగా తయారు చేయకపోవడం వల్ల విరోచనాలు, పచ్చకామెర్లు, జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తాయి. అలాగే పండ్లు ఎక్కువగా తింటూ జాగ్రత్తగా ఉండాలి. ఆకు కూరలను కూడా చక్కగా శుభ్రం చేసుకుని వండుకోవాలి. ముఖ్యంగా దుంప జాతులని అయితే శుభ్రం చేయకుండా తినకూడదు.
మాంసాహారానికి దూరంగా ఉండాలి
వర్షాకాలంలో మాంసాహారం తక్కువగా తినాలి. అధికంగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో మాంసం జీర్ణం కాదు. కాబట్టి తక్కువగా తీసుకోవడం మేలు.
ఫ్రీష్ గా తయారు చేసుకోవాలి
చాలా మంది బద్ధకానికి ఎప్పటి ఫుడ్ అప్పుడు తీసుకోరు. ముందుగానే అన్ని చేసి ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే కొందరు కూరగాయలను, పండ్లను కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటారు. ఇలా చేయకుండా ఎప్పటి కప్పుడు ఫ్రెష్ గా కట్ చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.
చల్లని పానీయాలు
ఎక్కువ మందికి పానీయాలు అంటే చాలా ఇష్టం. చల్లని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. వర్షా కాలంలో చల్లని డ్రింక్ లు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటివి వస్తాయి. కాబట్టి ఎలాంటి పానీయాలు తాగకుండా ఉంటే మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.