https://oktelugu.com/

Empty Purse: పర్సు ఖాళీగా ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయి

పర్సులో ఇతర కాగితాలు ఉంచుకోకూడదు. కొందరు ఏ బిల్లు పడితే ఆ బిల్లు పర్సులో పెట్టుకుంటారు. ఇది కరెక్టు కాదు. ఇవన్నీ పెట్టుకుంటే మనకు అరిష్టం కలుగుతుంది.

Written By: Srinivas, Updated On : May 15, 2023 1:18 pm

Empty Purse

Follow us on

Empty Purse: మనం రోజు జేబులో పర్సు పెట్టుకుంటాం. కానీ అందులో ఏముంటాయి? ఎలా ఉంచుకోవాలనేదానిపై పట్టింపు ఉండదు. దీంతో మనకు నష్టాలు కూడా రావొచ్చు. పర్సును ఎప్పుడు కూడా చిందరవందరగా ఉంచుకోకూడదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో పర్సును కూడా అంతే బాగా చూసుకోవాలి. పర్సులో ఇతరత్ర వస్తువులు ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయి.

పర్సులో ఇతర కాగితాలు ఉంచుకోకూడదు. కొందరు ఏ బిల్లు పడితే ఆ బిల్లు పర్సులో పెట్టుకుంటారు. ఇది కరెక్టు కాదు. ఇవన్నీ పెట్టుకుంటే మనకు అరిష్టం కలుగుతుంది. పర్సు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. అందులో కనీసం రూ.10 ల నోటు అయినా ఉంచుకోవాలి. ఇలా పర్సు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మనకు నష్టాలు తెస్తుంది.

పర్సులో ఎప్పుడు కూడా దేవుళ్ల చిత్రాలు ఉండకూడదు. మనుషులు బతికున్న వారు అయినా చనిపోయిన వారు అయినా వారి చిత్రాలు ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. ఇలా ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. పర్సులో కేవలం డబ్బులు మాత్రమే ఉంచుకోవాలి. ఇతర వస్తువులు ఉంచుకుంటే ఆర్థికంగా నిష్ర్రయోజనమే కలుగుతుంది.

పర్సులో డబ్బులు కూడా ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. చక్కగా ఉంచుకోవాలి. డబ్బులు చిందరవందరగా పెట్టుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అందుకే డబ్బులు ఎప్పుడు కూడా సరిగా సర్దుకోవాలి. పర్సును క్రమ పద్ధతిలో పెట్టుకోకపోతే ఇబ్బందులు తప్పవు. దీంతో పర్సు చక్కగా ఉంచుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి.