పిల్లలకు జ్వరమా.. చేయాల్సిన, చేయకూడని పనులివే..?

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలకు జ్వరం వచ్చినా కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చిన్నపిల్లలకు వచ్చే జ్వరాలలో ఎక్కువగా సాధారణ జ్వరాలే ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లే 90 శాతం జ్వరాలు పిల్లలకు వస్తాయి. పిల్లలకు జ్వరం వస్తే ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. వైరల్ జ్వరం కాకపోతే మాత్రం పిల్లలకు వెంటనే చికిత్స చేయిస్తే మంచిది.   పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే మాత్రం మెదడుపై ప్రభావం పడే అవకాశాలు […]

Written By: Navya, Updated On : May 22, 2021 7:42 pm
Follow us on

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలకు జ్వరం వచ్చినా కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చిన్నపిల్లలకు వచ్చే జ్వరాలలో ఎక్కువగా సాధారణ జ్వరాలే ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లే 90 శాతం జ్వరాలు పిల్లలకు వస్తాయి. పిల్లలకు జ్వరం వస్తే ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. వైరల్ జ్వరం కాకపోతే మాత్రం పిల్లలకు వెంటనే చికిత్స చేయిస్తే మంచిది.

 

పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే మాత్రం మెదడుపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. జ్వరం ఫిట్స్ వచ్చి మెదడువాపు లక్షణాలు ఉంటే మాత్రం ప్రమాదకరం అని చెప్పవచ్చు. జ్వరం వచ్చిన పిల్లలకు తేలికపాటి ఆహారం పెట్టాలి. నీళ్లు ఎక్కువగా తాగించడంతో పాటు మందులు వేసి డాక్టర్ ను సంప్రదించాలి. సాధారణంగా పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులు తడిబట్టతో తుడుస్తూ ఉంటారు.

 

తడిబట్ట వేసి తుడిస్తే వణుకు ఎక్కువై పిల్లాడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పిల్లలకు జ్వరం వస్తే ఏ జ్వరమో తెలుసుకోవడంతో పాటు ఏ జ్వరమో తెలుసుకోవడంతో పాటు ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. కిడ్నీలో నొప్పిగా ఉంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ లో ప్రధానంగా రక్తకణాల సంఖ్యను పరిశీలించుకోవాలి.

 

పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్ష చేయిస్తే మంచిది. పిల్లలకు జ్వరం వస్తే శరీరంలో ఇతర వ్యాధులు ఉన్నాయా..? గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎండలో ఎక్కువసేపు ఆడుకున్నా, బెడ్ షీట్ కప్పుకుని పడుకున్నా కొన్నిసార్లు జ్వరం వస్తుంది. అలాంటి సమయాల్లో ఎటువంటి చికిత్స చేయాల్సిన అవసరం లేదు.