National Family Health Survey: తెలంగాణలో గృహ హింస పెరుగుతోంది. కరోనా కాలం నుంచి ఇది మరింత ఎక్కువైంది. నేషనల్ ప్యామిలీ హెల్త్ సర్వేలో ఆందోళన కలిగించే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణా వ్యాప్తంగా భార్యలు చిన్న చిన్న కారణాలకు భర్తల చేత దెబ్బలు తింటున్నారని వెల్లడించింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే.
నేషనల్ ప్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. తెలంగాణలో 70.4% మంది పురుషులు, 83.8% మంది మహిళలు భార్యను కొట్టడాన్ని సమర్థించారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 వెల్లడించింది. ఇక్కడ భార్యను కొట్టడానికి భర్తలు ఎంచుకుంటున్న కారణాలు భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వాదించడం, శృంగారానికి నిరాకరించడం, సరిగ్గా వంట చేయకపోవడం, అబద్దాలు చెప్పడం. అత్తమామలను అగౌరవపరచడం వంటివి ఉన్నాయి.
Also Read: Adani: నాట్ ఇంట్రెస్ట్ : రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్న అదాని.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సీటు ఎవరికి మరి?
– ఇలా భర్తలు భార్యలన కొట్టడాన్ని పురుషులతో పోలిస్తే ఆశ్చర్యకరంగా 83.8% మంది మహిళలు సమర్థించారు. తాము తమ బాధ్యతలు సరిగ్గ నిర్వహించనప్పుడు కొట్టడం సమర్థనీయమని అభిప్రాయపడ్డారు.
అత్తమామలను అగౌరవపరిచినందుకు..
– తెలంగాణలో 69% మంది మహిళలు ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినందుకు భార్యను కొట్టడాన్ని సమర్థించారు.
– 67.6% మంది మహిళలు అత్తమామలను అగౌరవపరిచినందుకు భార్యను కొట్టడాన్ని సమర్థించారు.
– 31.2% మంది మహిళలు భర్తకు చెప్పకుండా బయటకు వెళితే కొట్టడాన్ని సమర్థించారు.
– 29.3 % భార్య భర్తతో వాదిస్తే కొట్టడాన్ని స్త్రీలు సమర్థించారు, భార్య అబద్దాలు చెబితే లేదా భర్తకు అనుమానం కలిగేలా ప్రవర్తిస్తే 26.8% మంది మహిళలు కొట్టడాన్ని సమర్థించారు.
– భార్య లైంగిక సంపర్కానికి నిరాకరిస్తే భర్త కొట్టడం సబబే అని 16.9% మంది సమర్థించారు.
– భార్య సరిగ్గ వంట చేయకపోతే కొట్టడం సరైందే అని 15% మంది అభిప్రాయపడ్డారు.
– తెలంగాణ వ్యాప్తంగా పైన చేప్పిన కారణాలతో దాదాపు 70.4% మంది పురుషులు భార్యలను కొడుతున్నట్లు సర్వే చెప్పింది.
భార్యాభర్తల కొట్లాటల్లో 3వ స్థానం..
భార్యాభర్తల కొట్లాటల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 18–49 ఏళ్ల మధ్య ఉన్న 41% మంది వివాహిత మహిళలు భార్యాభర్తల హింసను ఎదుర్కొన్నారు. భార్యాభర్తల హింసలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. దాదాపు 48% మంది మహిళలు భార్యాభర్తల హింసను బాధితులుగా సర్వే చెబుతుంది. తర్వాత బీహార్‌లో 43% మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 34% మంది మహిళలు భార్యాభర్తల హింసలో భాధితులుగా ఉన్నారు. తెలంగాణలో 18–49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 18.6% మంది తమ భర్తల నుంచి మానసిక హింసను ఎదుర్కొంటున్నారు, 36.7% మహిళలు శారీరక హింసను ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు 4.5% మంది లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. 40.4% మంది స్త్రీలు పై చెప్పిన మూడు రకాల హింసలను ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడించింది.
అయితే భర్తలు భార్యలను కొట్టడంలో అత్యంత సాధారణమైనది చెంపదెబ్బ కొట్టడం. పెళ్లయిన వారిలో 25% మంది భర్తలు చెంపదెబ్బ కొట్టినట్లు సర్వే తెలిపింది. 12% మంది మహిళలు తమను నెట్టడం, 10% మంది తమ చేతిని మెలితిప్పినట్లు లేదా జుట్టు లాగినట్లు తెలిపారు. 8–9% మంది తమ పిడికిలితో కొట్టడం లేదా తన్నడం, లాగడం వంటివి చేస్తారని తెలిపారు.
ఇదిలా ఉంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5 సర్వే (2019–21) దేశంలోని 707 జిల్లాల నుంచి 28 రాష్ట్రాలతోపాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులను కవర్ చేస్తూ సుమారు 6.37 లక్షల గృహాలలో ఈ సర్వే నిర్వహించారు.
Also Read:Bandi Sanjay: ఒక్క సారి అవకాశం ఇవ్వరా? బండి సంజయ్ అభ్యర్థన