Hair Fall Reduce Tips: ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం, రాలడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. జుట్టు సమస్యలు తలెత్తడానికి వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, వివిధ రకాల షాంపూల వాడకం వంటి కారణాల చేత జుట్టు రాలిపోతోంది. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
జుట్టు రాలడం, తెల్లబడటం సమస్యలను తగ్గించుకోవడానికి ఓ చిట్కా ఉంది. మూడు స్పూన్ల కలబంద గుజ్జును తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బరినూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. తరువాత ఐదు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. తరువాత హెయిర్ క్యాపు పట్టుకుని రాత్రంతా అలాగే ఉంచాలి.
ఉదయం రసాయనాలు తక్కువగా ఉండే షాంపూతో లేదా ఆయుర్వేద షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు రాలే, జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. ఇది వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలన్ని అందడంతో జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. చుండ్రుతో పాటు దురదలు కూడా లేకుండాపోయాయి. జుట్టు మంచిగా తయారవుతుంది.
ఏవేవో షాంపూలు వాడుతూ జుట్టును ఇంకా నిర్వీర్యంగా చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి సింపుల్ చిట్కాలు ఉపయోగించుకుని జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. జుట్టు రాలడం, తెల్లబడటం, పాలిపోవడం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అలాంటి వారంతో ఇలాంటి చిట్కా వాడుకుని జుట్టు సమస్యలను పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.