snoring : గురక వస్తుందా? మీరే కాదు మీ పక్కన వారు కూడా ఇబ్బంది పడతారు. ఎలా తగ్గించుకోవాలంటే..

మద్యం సేవించిన వారిలో కూడా గురక సమస్య ఏర్పడుతుంది. ఆల్కహాల్ గొంతులోని కండరాలను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల గాలి అనేది సరిగ్గా ఆడదు. కాబట్టి నోటితో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గురక వస్తుంది.

Written By: Swathi Chilukuri, Updated On : October 2, 2024 10:56 pm
Follow us on

snoring : ప్రస్తుతం చాలా మందిని గురక అనే సమస్య ఎక్కువ వేధిస్తుంది. హాయ్ గా నిద్రపట్టడమే కష్టం రా దేవుడా అనుకుంటే ఈ పక్కన ఉన్నవారు గురక పెడుతుంటే మరింత కష్టంగా ఉంటుంది కదా. అందుకే గురక ఉన్నవారి పక్కన పడుకోవాలి అంటే కూడా భయపడతారు. దీంతో ఈ గురక కారణంగా పక్కన ఉన్నవారికి నిద్ర అస్సలు పట్టదు. పక్కన ఉన్నవారు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గురక రావడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గురక వస్తే ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఈ కొత్త సమస్యల వల్ల మరింత ఇబ్బంది అనిపిస్తుంది. నోరు లేదా ముక్కు ద్వారా గాలి తీసుకునేటప్పుడు అడ్డంకులు ఏర్పడినప్పుడు.. నోటి ద్వారా గాలి తీసుకునే క్రమంలో గురక వస్తుంది. ఈ గురక వల్ల ప్రాణానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది. గురక ఎక్కువగా వస్తే ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి గురకను ముందుగానే నియంత్రించుకోవాలి. మరి ఈ ఇంటి చిట్కాలతో గురకను ఎలా తగ్గించుకోవచ్చో చూసేద్దాం.

అధిక బరువు:
అధిక బరువుతో బాధ పడేవారిలో గురక అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మెడ చుట్టూ కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన కొవ్వు వల్ల వాయు మార్గాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. తద్వారా గురక వస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. అదే విధంగా కొలెస్ట్రాల్ లేకుండా చేసుకోవాలి.

సరైన దిశలో పడుకోవాలి:
పడుకునే పొజిషన్ బట్టి కూడా గురక వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిటారుగా కాకుండా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. ఎక్కువగా ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిది. దీని వల్ల వాయు మార్గాలు ఫ్రీగా అవుతాయి.తద్వారా గాలి ప్రవాహం సులువగా జరుగుతుంది. గుండె మీద కూడా ఒత్తిడి పడదు.

తల ఎత్తుగా ఉండాలి:
నిద్రించే సమయంలో తల పైకి ఉండాలి. అంటే తల ఎత్తుగా ఉండేలా తలగడ ఏర్పాటు చేసుకోవాలి. తల కిందికి ఉంటే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి తల ఎత్తుగా ఉంటే వాయు మార్గం తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల గురక ఆగుతుంది.

నీటిని తీసుకోవాలి:
శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా గురక సమస్య వస్తుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోకపోతే.. గొంతు భాగంలో శ్లేష్మం ఉండి.. గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పగలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

మద్యం సేవించడం మానేయండి:
మద్యం సేవించిన వారిలో కూడా గురక సమస్య ఏర్పడుతుంది. ఆల్కహాల్ గొంతులోని కండరాలను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల గాలి అనేది సరిగ్గా ఆడదు. కాబట్టి నోటితో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గురక వస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.