Parenting Tips: ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ కు బాగా ఆకర్షితులవుతున్నారు. పూర్వం రోజుల్లో పిల్లలు ఏడ్చారంటే వారికి ఏవో చూపించి ఊరుకునేలా చేసేవారు. కానీ ఇప్పుడు యాంత్రిక జీవనంలో సెల్ ఫోన్ లే వారి ఏడుపును ఆపుతున్నాయి. సింపుల్ టెక్నిక్ వాడి చేతికి ఫోన్ రావాలంటే ఏడవాలి. దీంతో ఠక్కున ఫోన్ తీసుకొచ్చి వాడి చేతిలో పెడుతున్నారు. దీంతో వారి ఏడుపు ఆగిపోతుంది. ఇలా సెల్ పోన్ ను పిల్లలకు బాగా దగ్గర చేసి తప్పు చేస్తున్నాం. కానీ తప్పడం లేదని సమాధానాలు చెబుతున్నా భవిష్యత్ లో ఈ అలవాటు ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎందుకంత తొందర
పిల్లవాడు ఏడుపు మొదలు పెట్టగానే ఫోన్ తీసుకెళ్లి చేతిలో పెడితే ఏడుపు తగ్గుతుంది కానీ దాంతో వచ్చే పరిణామాలు తెలుసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కేరళ సంఘటన. అక్కడ ఓ పాప ఫోన్ కు బాగా ఆకర్షితురాలు అయింది. స్కూలుకు వెళ్లి వచ్చిందంటే చాలు ఫోన్ చేతిలో పట్టుకుని గేమ్ లు ఆడటమే అలవాటుగా చేసుకుంది. దీంతో ఫోన్ చార్జింగ్ పెట్టి కూడా గేమ్ లు ఆడే వరకు వెళ్లింది.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం
తల్లిదండ్రులు కూడా ఆమెను పట్టించుకునే వారు కాదు. దీంతో ఇంట్లో సమయమంతా ఫోన్ చూసేందుకే కేటాయించేది. ఫోన్ చార్జింగ్ పెట్టినా ఫోన్ పట్టుకునే ఉండేది. కానీ ఫోన్ చార్జింగ్ లో ఉండగా ఆడటం ప్రమాదకరమని తెలిసినా వినలేదు. దీంతో ఒక్కసారిగా సెల్ పేలిపోయింది. దీంతో బాలికకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించింది. ఇలా ఫోన్ వల్ల ఆమె ప్రాణాలే కోల్పోయింది.
కనువిప్పు కలగడం లేదు
ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పేరెంట్స్ కు కనువిప్పు కలగడం లేదు. సెల్ ఫోన్ వల్ల ఎన్నో ఆపదలు ఉన్నాయని తెలిసినా వాటిని పిల్లల చేతికి ఇస్తూ వారి భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం తల్లిదండ్రులే. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ లు పిల్లలకు ఇవ్వకండి. వారిని ప్రమాదాలకు గురి చేయకండి. మంచి పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి. డ్రాయింగ్, ఆటలు ఆడేలా మార్గనిర్దేశం చేయండి. అంతేకాని సెల్ ఫోన్లు వారి చేతికి ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడకండి.