https://oktelugu.com/

 Astro Tips: ఇంట్లో దుష్టశక్తులను నివారించడానికి పూజగదిలో చేయాల్సిన మార్పులు ఇవే!

Astro Tips: మనలో చాలామంది ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు ఉన్నా సంతోషకరమైన జీవనాన్ని సాగించడంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న దుష్టశక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని మనలో చాలామంది బలంగా విశ్వసిస్తారు. మనలో చాలామంది వాస్తును అనుసరించి ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ఇంటిని నిర్మించుకునే సమయంలో వాస్తును పాటించకపోయినా ఏవైనా చిన్నచిన్న తప్పులు చేసినా మాత్రం ఇబ్బందులు పడక తప్పదని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 25, 2022 / 12:21 PM IST
    Follow us on

    Astro Tips: మనలో చాలామంది ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు ఉన్నా సంతోషకరమైన జీవనాన్ని సాగించడంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న దుష్టశక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని మనలో చాలామంది బలంగా విశ్వసిస్తారు. మనలో చాలామంది వాస్తును అనుసరించి ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది.

    అయితే ఇంటిని నిర్మించుకునే సమయంలో వాస్తును పాటించకపోయినా ఏవైనా చిన్నచిన్న తప్పులు చేసినా మాత్రం ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోవాలి. ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఇంటికి సంబంధించి వాస్తుపరంగా మార్పులు చేయడంతో పాటు పూజగదిలో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో స్వస్తిక్ లేదా ఓం చిహ్నాన్ని ఉంచడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది.

    ఇంట్లో ఏ సమస్య వచ్చినా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. తరచూ గొడవలు పడితే కుటుంబంలో ఎవరూ సంతోషంగా జీవనం సాగించలేరు. దక్షిణం వైపున ప్రధాన ద్వారం ఉంటే గణపతి పటాన్ని తలుపు ముందు వేలాడదీయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వాస్తు దోషాలు ఉంటే రుద్రాక్షలను ధరించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.

    పూజగదిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల దేవతల అనుగ్రహం కుటుంబంపై ఉండే అవకాశం అయితే ఉంటుంది. పూజగదిలో ఖరీదైన వస్తువులను ఉంచితే ఇంటి సంపద తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. పూజ గదిలో దేవుని పటాలను ఒక పటానికి ఎదురుగా మరొకటి ఉంచకూడదు. కుటుంబంలో ఎవరూ పొద్దెక్కిన తర్వాత నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.