Stomach: పొట్టలో గ్యాస్ ను నయం చేసే మెడిసిన్ ఏంటో తెలుసా?

Stomach: ఆధునిక కాలంలో మన ఆరోగ్యం కలవరపెడుతోంది. మన జీవనశైలి ఇబ్బంది పెడుతోంది. దీంతో మనం పలు మందులు వాడాల్సి వస్తోంది. అయినా లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో మనకు ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలున్నాయి. పలు రోగాలను నయం చేయడానికి పలు మార్గాలున్నాయి. ఏ రోగాన్నయినా నయం చేయడానికి పలు మందులు ఉపయోగడతాయి. దగ్గు, జలుబు నుంచి పెద్ద పెద్ద రోగాలను కూడా బాగు చేసే సత్తా ఆయుర్వేదంలో మనకు కనిపిస్తాయి. దీంతో ఆయుర్వేద మందులు […]

Written By: Srinivas, Updated On : March 3, 2023 12:35 pm
Follow us on

Stomach


Stomach:
ఆధునిక కాలంలో మన ఆరోగ్యం కలవరపెడుతోంది. మన జీవనశైలి ఇబ్బంది పెడుతోంది. దీంతో మనం పలు మందులు వాడాల్సి వస్తోంది. అయినా లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో మనకు ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలున్నాయి. పలు రోగాలను నయం చేయడానికి పలు మార్గాలున్నాయి. ఏ రోగాన్నయినా నయం చేయడానికి పలు మందులు ఉపయోగడతాయి. దగ్గు, జలుబు నుంచి పెద్ద పెద్ద రోగాలను కూడా బాగు చేసే సత్తా ఆయుర్వేదంలో మనకు కనిపిస్తాయి. దీంతో ఆయుర్వేద మందులు వాడితే ఫలితంగా బాగా వస్తుంది.

మనకు ఆకలి బాగా వేయాలన్నా, మలబద్ధకం సమస్య లేకుండా చేయాలన్నా ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు ఉంటాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటివి కూడా తొందరగా నయం చేస్తాయి. అజీర్తి సమస్యతో బాధ పడుతున్నట్లయితే దాన్ని నివారించుకోవడానికి సైతం పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. వామును వేయించుకుని ఒక చెంచా తీసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఒక చెంచా చేర్చుకోవాలి. సొంటి కూడా ఒక చెంచా వేసుకోవాలి. అలాగే సైంధవ లవణం నాలుగు కలుపుకుని దంచుకుని పొడి చేసుకోవాలి.

Also Read: Kodali Nani Arrested: కొడాలి నాని అరెస్టు ఎందుకు? అసలు కేసేంటి? ఎందుకు అరెస్టు చేస్తున్నారు?

Stomach

ఈ పొడిని రోజు ఉదయం సాయంత్రం అర చెంచా లేదా ముప్పావు చెంచా కన్నా ఎక్కువ మజ్జిగలో వేసుకుని కలుపుకుని తాగితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. కడుపులో అజీర్తి తొలగిపోతోంది. కడుపు ఉబ్బరం సమస్య నుంచి దూరం చేస్తుంది. కడుపులో ఇంకా ఏవైనా మలినాలు ఉంటే బయటకు పంపించడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇలా ఈ నాలుగు వస్తువులతో మన అనారోగ్యాన్ని దూరం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది అందరు గుర్తుంచుకోవాలి.

ఇంకా తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ వీటిని త్రిఫల చూర్ణం అంటారు. వీటితో మనకు ఎన్నో రకాల జబ్బులకు పరిష్కారం దొరుకుతుంది. అజీర్ణం, ఒళ్లు నొప్పులకు బాగా పనిచేస్తాయి. సొంటి, పిప్పళ్లు, మిరియాలు వీటి చూర్ణాలు కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆరు చూర్ణాలు ఐదు గ్రాములు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య దూరం అవుతుంది. ఇలా ఆరోగ్య పరిరక్షణలో ఎన్నో రకాల పరిష్కార మార్గాలు మనకు కనిపిస్తుంటాయి. ఇలా మనకు కలిగే నష్టాలను పూడ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: Minister Jayaram: అడ్డంగా బుక్కైన మంత్రి జయరాం