Dharmashastra : మనలో చాలామందికి ధర్మ, నీతి శాస్త్రాల గురించి సరైన అవగాహన లేదు. వీటి గురించి అవగాహనను కలిగి ఉండటం ద్వారా సమాజంలో ఏ విధంగా మెలగాలో భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుస్తుంది. ధర్మ శాస్త్రం ప్రకారం పురుషుడు కుటుంబంలో భార్య, తల్లి చేసిన వంటకాలను పేర్లు పెట్టకుండా తినాలి. భార్య ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు గురించి ఆగ్రహం వ్యక్తం చేయకుండా ప్రవర్తించాలి. కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేసే విషయంలో ముందువరసలో ఉండాలి.
కుటుంబానికి మంచి జరిగినా చెడు జరిగినా వాటిలో పాలు పంచుకుంటూ తోడ్పాటును అందించాలి. భార్యకు ఎలాంటి కష్టం వచ్చినా తగినంత సహాయం చేయాలి. భార్యకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండగా భర్త జాగ్రత్త వహించాలి. భార్య లేదా కుటుంబ సభ్యులు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును క్షమించే క్షమా గుణాన్ని కలిగి ఉండాలి. రూపంలో కృష్ణునిలా ఎప్పుడూ ఆనందంగా సంతోషంతో వ్యవహరించాలి.
చేపట్టిన కార్యాలను నిర్వహించే విషయంలో సంయమనం, నేర్పుతో ఉంటూ భార్యకు తగిన గౌరవం ఇస్తూ హుందాగా ప్రవర్తించాలి. చేసే పనులు కుటుంబం కీర్తిప్రతిష్టలను పెంచే విధంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనులను చేసే విషయంలో యోగిలా వ్యవహరించాలి. ప్రతిఫలంను ఆశించకుండా పనులు చేయాలి. భార్యను తిట్టడం, భార్య తరపు బంధువులతో వాదించటం చేయకూడదు.
కుటుంబంలో భార్య బాధ పడేలా వాతావరణం ఉండకుండా భర్త జాగ్రత్తపడాలి. భార్య అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ జీవనం సాగించాలి. పిల్లల ముందు భార్యకు కూడా తగిన గౌరవం ఇస్తూ మాట్లాడాలి. ఈ అలవాట్లను ఇప్పటివరకు పాటించని వాళ్లు సైతం ఈ అలవాట్లను మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!