Summer Health Tips: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండటం మాత్రమే కాదు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందట. అందుకే ఈ సమయంలో శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచుకోవాలి. అందుకోసం ప్రతి రోజూ తగినంత నీరు తాగాలి. నీటితో శరీరాన్ని డీహైడ్రేషన్ సమస్యను నివారించుకోవచ్చు. అయితే సీజన్ ను బట్టి నీటిని సేవించాలట. శీతాకాలంలో తక్కువ నీరు తీసుకోవడం వల్ల కూడా బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. కానీ వేసవిలో మాత్రం చాలా నీరు అవసరం.
అయితే నీరు శరీరానికి ఎంత అవసరం? ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి? ఎప్పుడు తక్కువ తీసుకోవాలి అనే వివరాలను కూడా పరిశీలిద్దాం. వేసవిలో ప్రతి ఒక్కరూ హైడ్రేటెడ్ గా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలట. అంతేకాదు కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చట.
ప్రతిరోజు తగినన్ని నీటిని తీసుకోవడం వల్ల రాళ్ల సమస్య వచ్చే సమస్యనే ఉండదంటున్నారు యూరాలజిస్టులు. నీటి కొరత ఉంటే ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందట. వీటిన్నింటిని నివారించాలంటే మీరు ఎక్కువ నీరును తీసుకోవాల్సిందే. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను మూత్రం రూపంలో తొలగించడంలో సహాయపడుతుంది నీరు. అందుకే అవసరాన్ని బట్టి నీరు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే మరింత ఎక్కువ నీటిని సేవించాలట.
వేసవిలో కేవలం నీరు తాగితే మాత్రమే సరిపోదట. సీజన్ కు అనుగుణంగా ఆహారం కూడా తీసుకోవాలి. వేసవిలో ప్రజలు ద్రవపదార్థాలను చేర్చుకోవాలి. దీనివల్ల శరీరంలో ద్రవాల పరిమాణం సమతుల్యంగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.