New York : ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరాలు ఉన్నాయి. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో నగరాల్లో ఉండే జీవనం నరకప్రాయమే అయినా వాటి విలువ మాత్రం పెరుగుతోంది. ప్రపంచంలో నగర జనాభా అధికంగా పెరుగుతోంది. దీంతో వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్ నగరం అత్యంత సంపన్నమైన నగరంగా ప్రసిద్ధి గాంచింది. అక్కడి పరిస్థితుల వల్ల అది అత్యంత సంపన్న నగరంగా కీర్తి గడించింది.
ఈ నగరంలో 3,40,000 మంది కోటీశ్వరులున్నట్లు తెలుస్తోంది. తరువాత స్థానాల్లో జపాన్ రాజధాని టోక్యో, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిన్స్ కో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఉన్న నగరాలుగా ఇవి నిలుస్తున్నాయి. లాస్ ఏంజెల్స్, షికాగో నగరాలు కూడా తరువాత స్థానాల్లో ఉంటున్నాయి. దీంతో ఈ నగరాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్న నగరాలుగా కూడా ప్రసిద్ధి చెందుతున్నాయి. న్యూయార్క్ లో వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉండటంతోనే అక్కడ వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. సంపన్న నగరంగా అవతరిస్తోంది.
ప్రపంచంలో అధిక మంది కోటీశ్వరులున్న నగరాలుగా ఇవి నిలవడం గమనార్హం. ఇక్కడ వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. వ్యాపారులు కూడా ఎదుగుతున్నారు. కుబేరులకు స్వర్గధామంగా నిలుస్తున్న నగరాలతో వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ఈ క్రమంలో కోటీశ్వరులను తయారు చేస్తున్న నగరాల్లో ఇవి నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కుబేరుల జాబితా పెరుగుతోంది. వ్యాపారులకు అనుకూల పరిస్థితులు ఉండటంతోనే వారి వ్యాపారాలు దూసుకుపోతున్నాయి. వారి ఆర్థిక స్థితిగతులు పెరగడంతోనే ప్రపంచంలో అత్యంత సంపన్నుల నగరాలుగా మారుతున్నాయి. మన దేశంలో కూడా కుబేరుల సంఖ్య పెరుగుతోంది. కానీ మన నగరాలు సంపన్న నగరాలుగా మార్పు చెందడం లేదు.