Hot Water : వేడి నీరు తాగేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివీ

Hot Water : ప్రస్తుత కాలంలో అందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నోటికి ఏది దొరికితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయినా లెక్కచేయడం లేదు. జంక్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫిజాలు, బర్గర్లు తింటూ చేజేతులా ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారు. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మనం తాగే నీళ్లతో మనకు యాభై శాతం రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : April 10, 2023 2:37 pm
Follow us on

Hot Water : ప్రస్తుత కాలంలో అందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నోటికి ఏది దొరికితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయినా లెక్కచేయడం లేదు. జంక్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫిజాలు, బర్గర్లు తింటూ చేజేతులా ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారు. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

మనం తాగే నీళ్లతో మనకు యాభై శాతం రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీరుపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మినరల్ వాటర్ కన్నా నల్లా నీరే తాగడం సురక్షితం. దీంతో మనం తాగేనీరు విషయంలో చొరవ తీసుకోవాలి. ఏదైతే ఏంటి అని తాగడం వల్ల అనారోగ్యాలు రావడం సహజం. దీని వల్ల మనకు ఇబ్బందులు రావడం ఖాయం.

వేడి నీరు తాగడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఉదయం పూట గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగుతుంటాం. దీంతో కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రి పూట కూడా నీళ్లు వేడి చేసుకుని తాగడం వల్ల మనకు మంచి లాభాలు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు వీటితో మన ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది.

రాత్రి పూట భోజనం చేశాక రెండు గంటల తరువాత తీసుకుంటే మంచిది. రెండు గ్లాసుల నీరు తీసుకుని అవి సగం గ్లాసు అయ్యే వరకు వేడి చేసి చల్లారాక తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. పలు రకాల రోగాలను నియంత్రించే శక్తి వేడి నీటికి ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో వేడి నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ క్రమంలో వేడినీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.