Weight Loss Tips: ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇంట్లో పనిచేసుకునే మహిళల్లో బరువు పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వారు బాధపడుతూ దీన్ని నుంచి ఎలా బయట పడాలోనని ఆలోచిస్తున్నారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నా బరువు పెరగడంపై ఆందోళన చెందుతున్నారు. అధిక బరువును తగ్గించుకునే క్రమంలో పలు చిట్కాలు పాటించి సమస్య నుంచి దూరం కావాలని భావిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు ఇంటి పని చేసుకునే మహిళలు బరువు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
మహిళలు సుమారు 65 కిలోల నుంచి 70 కిలోల బరువు ఉంటున్నారు. రోజంతా ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఎన్ని పనులు చేసుకుంటున్నా బరువు మాత్రం తగ్గడం లేదు. గంట గంటకు శక్తి ఖర్చవుతున్నా వెయిట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వారి ఐడియాలు పనికి రాకుండా పోతున్నాయి. ఆడవారి బరువు 90 కిలోలు ఉన్నా గంటగంటకు పనులు చేస్తున్నా కేలరీలు సరిగా ఖర్చు కావడం లేదు. కూరగాయలు కోసుకోవడం, పాత్రలు తోమడం వంటి పనులతో 150 కేలరీలు ఖర్చవుతాయి.
ఇంకా ఇతర పనులకు సైతం కేలరీల శక్తి ఖర్చవుతుంది. బట్టలు ఇస్త్రీ చేయడం, పిల్లలను రెడీ చేయడం వంటి పనులకు 120 కేలరీలు ఖర్చవుతాయి. ఇంకా బూజులు దులుపుకోవడం, ఇల్లంతా కడుక్కోవడం వంటి పనులకు గంటకు 400 కేలరీలు పోతాయి. ఇలా ఇన్ని కేలరీలు ఖర్చవుతున్నా వారి బరువు నియంత్రణలోకి రావడం లేదు. ఒళ్లంతా నొప్పులు వస్తున్నా వారి బరువు అదుపులోకి రావడం లేదు. వంగటం లేవడం వంటి చర్యలకు ఒట్లో శక్తి కరుగుతోంది.
కొవ్వు కరిగించుకోవాలనే మహిళలు ఇంటి పనిమనుషులను పెట్టుకునే బదులు వారే పనులు చేసుకోవడం మంచిది. ఆహారం విషయంలో శరీరానికి 2000 శక్తి అవసరం. ఉదయం సమయంలో మొలకలు, పండ్లు తింటే ఎంతో బలం వస్తుంది. పోషకాలు సమృద్ధిగా అందుతాయి. తక్కువ ఆయిల్ ఉండేలా కూరలను చేసుకోవాలి. ఇతర పనులు చేసుకోవడానికి ఇంకా కొంచెం శక్తి కావాలి. దీనికి మనం తినే ఆహారంలో శక్తిని ఇచ్చేవి ఉండేలా జాగ్రత్త పడాలి. దీంతో మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.