https://oktelugu.com/

Heat Wave: ఎండలో బయటకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

వేడి బారి నుంచి రక్షించుకోవడానికి మంచి ఆహారాలు తీసుకుంటే మంచిది. లేకపోతే మనం ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2023 / 03:51 PM IST

    heat wave effects

    Follow us on

    Heat Wave: ఎండలు ముదిరాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో తిరగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ దెబ్బ తగిలే ప్రమాదముంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిది. దీంతో ఎండ బారి నుంచి రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందే.

    ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

    వేడి బారి నుంచి రక్షించుకోవడానికి మంచి ఆహారాలు తీసుకుంటే మంచిది. లేకపోతే మనం ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. పచ్చళ్లు తినడం వల్ల మంచిది కాదు. మసాలాలు, ఉప్పు, కారం, నూనెలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. దీంతో వేసవి కాలంలో వేడి నుంచి తప్పించుకోవడానికి పలు చర్యలు తీసుకుంటే సరి.

    జాగ్రత్తలు పాటించాలి

    ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే తెల్ల బట్ట కట్టుకోవాలి. ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. బాటిల్ లో నీళ్లు తీసుకుని పోవాలి. అందులో నిమ్మరసం కలుపుకుంటే ఇంకా మంచిది. వడదెబ్బ ముప్పు ఉండదు. ఇలా చేయడం వల్ల మనకు ఎండ దెబ్బ నుంచి రక్షణ కలుగుతుంది.

    నివారణ చర్యలేమిటి?

    ఎండాకాలంలో మన శరీరం వేడిగా మారుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గితే వడదెబ్బ సోకే ప్రమాదముంటుంది. దీంతో మన శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ తాగుతూ ఉండాలి. ఇలా ఎండ బారి నుంచి రక్షించుకునేందుకు కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. దీంతో ఎండాకాలం జాగ్రత్తలు తీసుకుని మన శరీరాన్ని వడదెబ్బకు గురికాకుండా చేసుకోవాలి. ముఖానికి గుడ్డలు కట్టుకోవాలి. నెత్తి మీద టోపీ ధరించాలి. తాగునీరు బాటిల్ లో వెంట తీసుకెళ్లాలి. దాహం వేసినప్పుడల్లా తాగుతుండాలి.