Heart Health Tips: మన శరీరంలోని అతి ముఖ్యమైన, సున్నితమైన అవయవాలలో గుండె ఒకటి. అది కొట్టుకున్నంత కాలం మన జీవితం కొనసాగుతుంది. లేదంటే ఆ పై లోకానికి వెళ్లాల్సిందే. సో ఆ గుండెను భద్రంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పని. కానీ ప్రస్తుతం డబ్బు, పని మీద ఉన్న ధ్యాస శరీరం మీద చాలా మందికి ఉండటం లేదు. జీవనశైలి చాలా మందికి దారుణంగా ఉంటుంది. సాధారణంగా, దీనికి సంబంధించిన ఫిర్యాదులు వృద్ధాప్యంలో మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ అవయవాలు బలహీనపడతాయి. వాటి పనితీరులో సమస్యలు తలెత్తుతాయి. కానీ నేటి కాలంలో వృద్దాప్యం వరకు ఏ వ్యాధి కూడా ఆగకుండా ముందే అటాక్ చేస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, తక్కువ శారీరక శ్రమ, క్రమరహిత దినచర్య వంటివి గుండెను బలహీనంగా మారుస్తున్నాయి.
Also Read: లేవగానే మొబైల్ పడుతున్నారా? ముందు ఈ పనులు చేయండి
అటువంటి పరిస్థితిలో, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ మన హృదయం బలహీనపడుతోందని మనకు ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న మీకు వచ్చిందా? కార్డియాలజిస్టుల ప్రకారం, గుండె బలహీనతను గుర్తించడానికి కొన్ని నిర్దిష్ట సంకేతాలు ఉన్నాయి. ఈ లక్షణాలు కొనసాగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
1. శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీలో భారంగా అనిపించడం: గుండె బలహీనత కారణంగా, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల సరిగ్గా శ్వాస ఆడదు. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు తేలికపాటి శారీరక శ్రమ చేసినప్పటికీ, ఛాతీలో ఒత్తిడి లేదా భారంగా అనిపిస్తుంది.
2..త్వరగా అలసిపోయినట్లు అనిపించడం: తేలికైన పని చేసిన తర్వాత కూడా మీకు చాలా అలసటగా అనిపిస్తుంటుంది. కొన్ని సార్లు కొందరికి జస్ట్ మెట్లు ఎక్కితే కూడా చాలు చాలా సమస్యగా అనిపిస్తుంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోయినా, నీరసంగా, బలహీనంగా అనిపించినా సరే మీ గుండె బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.
3. నిరంతరం తలతిరగడం లేదా మూర్ఛపోవడం: మీకు తరచుగా తల తిరుగుతున్నట్లు లేదా బలహీనంగా అనిపిస్తే, అది రక్తపోటు సమస్య వల్ల కావచ్చు. ఇది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు.
4. పాదాలు – చీలమండలలో వాపు: గుండె బలహీనపడినప్పుడు, శరీరంలో రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది. దీని వలన పాదాలు, చీలమండలు, కడుపులో కూడా వాపు వస్తుంది. సో జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
Also Read: లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండిలా!