https://oktelugu.com/

Heart: ఎలాంటి ఆపరేషన్ లేకుండా మీ గుండె బ్లాకులు తొలగించే ఔషధం ఇదీ

Heart: ఒకప్పుడు 60 ప్లస్ వయసు వారికి మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ నేటి కాలంలో స్కూలుకెళ్లే విద్యార్థికి హార్ట్ ఎటాక్ వచ్చి మరణిస్తున్నారు. అందుకు గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో పూడిక పేరుకుపోవడమే కారణమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తనాళాల్లో పూడిక పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది బైపాస్ సర్జరి చేయించుకోవాలని అనుకుంటారు. అయితే బైపాస్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 15, 2023 / 12:46 PM IST
    Follow us on

    Heart: ఒకప్పుడు 60 ప్లస్ వయసు వారికి మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ నేటి కాలంలో స్కూలుకెళ్లే విద్యార్థికి హార్ట్ ఎటాక్ వచ్చి మరణిస్తున్నారు. అందుకు గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో పూడిక పేరుకుపోవడమే కారణమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తనాళాల్లో పూడిక పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది బైపాస్ సర్జరి చేయించుకోవాలని అనుకుంటారు. అయితే బైపాస్ సర్జరీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు బైసాస్ సర్జరీ చేయడానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఖర్చవుతుందని కొందరు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని పద్ధతుల ద్వారా గుండె రక్తనాళాల్లోని పూడికలను తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

    ఇప్పుడంతా ఒత్తిడి వాతావరణం. స్కూలుకెళ్లె పిల్లాడి నుంచి ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కిరు ఏదో ఒక ప్రెషర్ కు లోనవుతున్నారు. దీంతో అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇదే సమయంలో ఇంటి ఆహారం కాకుండా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, తదితర సమస్యలు పెరిగిపోతున్నాయి. చిరుతిళ్లు, బయటి ఆహరం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.ఇవి గుండె జబ్బులకు దారి తీస్తాయి. గుండె నుంచి రక్తాన్ని పంపింగ్ చేసే రక్తనాళాల్లో పూడికలు నిండిపోవడంతో హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.

    అయితే గుండెరక్తనాళాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు ఖర్చు తడిసి మోపెడుతుంది. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఆయుర్వేద వైద్య నిపుణుల ప్రకారం.. న్యాచురోపతి ప్రిన్సిపల్ సలాడ్స్, ప్రూట్స్, నట్స్, మొలకలు, ఉడికిన ఆహారంలో తక్కువ ఉప్పు, తక్కువ నూనె వాడాలని అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు తీసుకునే ఆహారంతో పాటు ఒత్తిడి కూడా కారణమే. అందుకే రోజు ఉదయం, సాయంత్రం ఏరోబిక్ వ్యాయామం చేయాలని అంటున్నారు. దీంతో రక్త ప్రసరణ ఎక్కువగా సాగి నాళాల్లో ఉండే పూడికలు తొలిగిపోతాయని అంటున్నారు.

    నేటి కాలంలో చిన్న జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే బోలెడు ఖర్చవుతుంది. అలాగని వైద్యం చేయించుకోకుండా ఉండలేం. పోనీ ఇలాంటి సమస్యలు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడున్న కలుషిత వాతావరణంలో అది సాధ్యం కావడం లేదు. అలాంటప్పుడు కొన్ని పద్దతుల ద్వారా మనకు వచ్చిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ద్వారా పెద్ద వ్యాధులను దరిచేరనివ్వమని అంటున్నారు.

    Tags