Homeహెల్త్‌How to stay healthy at 60: 60 లో ఆరోగ్యంగా ఉండాలంటే 20 నుంచే...

How to stay healthy at 60: 60 లో ఆరోగ్యంగా ఉండాలంటే 20 నుంచే ఇలా చేయాలి..? లేదంటే వ్యాధులు తప్పవు..

How to stay healthy at 60: ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో బిజీగా ఉండే రోజులు ఇవి. డబ్బు సంపాదన.. కెరీర్ లక్ష్యం.. బరువు బాధ్యతలు.. వ్యాపార టార్గెట్లు.. ఇవే జీవితంలో కీలకంగా మారిపోతున్నాయి. వీటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్న వారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారు. సాధారణంగా నిద్ర లేవగానే తగినంత విశ్రాంతి తీసుకుని.. వ్యాయామం చేసే అవసరం ఉండగా.. ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల పనులతో బిజీగా మారిపోతున్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో రావలసిన రోగాలన్నీ చిన్న వయసులోనే వస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే 20 ఏళ్ల వయసు నుంచే ప్రత్యేకంగా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. అందుకోసం ప్రణాళిక ప్రకారం గా వ్యాయామం చేస్తూ ముందుకు వెళ్లాలి. అసలు ఇప్పటినుంచి ఎలాంటి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

20 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వారిలో శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఈ వయసులోనే వారానికి నాలుగు నుంచి ఆరు రోజులపాటు శారీరక శ్రమ చేయాలి. ఇలా చేయడం వల్ల వచ్చే రోజుల్లో ఎముకలు దృఢంగా మారిపోతాయి. వాటి సాంద్రత కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సమయంలో తగిన వ్యాయామం చేస్తే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత బిజీగా మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ రెగ్యులర్గా చేసే పనులతో పాటు వ్యాయామంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు యోగ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కుర్చీలు, సోఫాలపై కాకుండా కింద కూర్చునే అలవాటు చేసుకోవాలి. మహిళలు ఈ సమయంలో రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

40 ఏళ్ల వయసు వచ్చిన వారిలో జీర్ణక్రియ సమస్య ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమయంలో కీళ్లపై ఒత్తిడి పడకుండా స్విమ్మింగ్ చేస్తూ సైక్లింగ్ వంటివి చేయాలి. హార్మోన్ల సమతుల్యత కోసం ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కండరాల క్షీణత కూడా ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది. అయితే ఎముకల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇదే సమయంలో గుండె సమస్యలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నీరసం, అలసట పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న వ్యాయామం చేయడం ప్రారంభించాలి. ఎప్పుడు ఒకే చోట కూర్చోకుండా అటు ఇటు తిరగడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. మానసిక సంతోషం కోసం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలుస్తూ ఉండాలి. ప్రతిరోజు ఏడు నుంచి 8 గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version