Alcohol health warnings: మద్యం తాగడం హానికరం అని ఆల్కహాల్ కనిపించే ప్రతిచోట రాసి ఉంటుంది. కానీ ఎవరూ దీనిని పట్టించుకోరు. మద్యం తాగడం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని కొందరు భావిస్తే.. మద్యం తాగితేనే తమకు నిద్ర వస్తుందని ఇంకొందరు అనుకుంటారు. ఇలా రకరకాలుగా ఎంతోమంది రోజు మద్యం తాగేవారు ఉన్నారు. ప్రతిరోజు మద్యం తాగడం వల్ల ఎప్పటికైనా అనారోగ్యమే. అయితే కొందరు ప్రతిరోజు రెండు పెగ్గులు తాగడం వల్ల గుండెకు ఆరోగ్యకరం అని అంటారు. రెండు పెగ్గులు అయినా.. ఒక పెగ్గు అయినా మద్యం తాగడం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అని కొందరు అంటారు. వాస్తవానికి ఒకప్పుడు రెండు పెగ్గులు అని అన్నారు.. కానీ ఇప్పుడు పూర్తిగా మానివేయమని చెబుతున్నారు. ఎందుకు అలా మారింది?
మానసికంగా ఆనందాన్ని పొందడానికి మద్యం తప్పనిసరిగా మార్చుకున్నారు కొందరు. అయితే మద్యం తాగి విషయంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఇలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ పర్టికులర్గా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరూ మద్యం సేవించరు. మద్యం సేవించడం మొదలుపెడితే అది ఎప్పటి వరకు పూర్తవుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. ఇలా కొందరు రెండు పెగ్గులు అని ప్రారంభించి ఆ తర్వాత బాటిల్ మొత్తం తాగే వారు కూడా ఉన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని ఒకప్పుడు వైద్యులు రెండు పెగ్గులు తాగమని చెప్పారు.. కానీ రెండు పెగ్గుల నుంచి మొదలుపెట్టి పది పెగ్గుల వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలా ప్రతిరోజు రెండు పెగ్గులు అనుకుంటూ ఫుల్లుగా తాగేస్తున్నారు. అలా తాగిన వారు ప్రాణాలు మీకి తెచ్చుకొని అనారోగ్య పాలవుతున్నారు. అయితే వైద్యులే రెండు పెగ్గులు తాగమని చెబుతున్నారని కొందరు అంటున్నారు..
యూకే లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మద్యం తాగడం చాలా హానికరం. ప్రతిరోజు ఒకటి లేదా రెండు పెగ్గులు తీసుకున్నా.. ప్రమాదకరమే. అంతేకాకుండా కొందరు మద్యం సేవించే సమయంలో వేయించిన ఆహారం.. ఆయనతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొందరు మద్యం మత్తులో ఏం తింటున్నామో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలా మద్యం మత్తులో కొన్ని అనారోగ్య పనులు కూడా చేసే అవకాశం ఉంది. అందుకే మధ్యాన్ని పూర్తిగా నిర్మూలించడం వల్లే ఆరోగ్యానికి లాభదాయకం అని వైద్యులు అంటున్నారు. అందువల్ల ఒకప్పుడు రెండు పెగ్గులు అని.. ఇప్పుడు ఆ రెండు పెగ్గులు కూడా ముట్టుకోకుండా ఉండడమే మంచిదని అంటున్నారు.
కానీ చాలామంది అదేమీ పట్టించుకోకుండా ప్రతిరోజు ఫుల్లుగా మద్యం తాగేస్తున్నారు. అయితే ప్రతిరోజూ మద్యం తాగేవారు ఇప్పటికైనా దానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం మద్యంలో క్యాన్సర్ కారకాలు కూడా ఉన్నాయని గుర్తించారు. దీంతో భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.