Health Tips: దాదాపుగా ప్రతీ ఒక్కరు తీసుకునే ఆహార పదార్థాలు ఎగ్ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. శాకాహారులు సైతం ఎగ్ ను తీసుకుంటారు. దీనిని శాకాహారంగానే భావిస్తారు కూడా. ఇకపోతే ఈ గుడ్లను రకరకాలుగా తీసుకుంటుంటారు. యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా కొందరు ఉడకబెట్టుకుని తీసుకుంటారు. మరి కొందరు ఫ్రై చేసుకుంటారు. ఇంకొందరు ఆమ్లెట్లు వేసుకుంటారు. కాగా, గుడ్లను తీసుకోవడం వల్ల కలిగనే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డును ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. విటమిన్స్ ఏ, బీ, ఫోలిక్ యాసిడ్ తో పాటు మినరల్స్ మెగ్నిషియం, సెలీనియం, క్యాల్షియం, జింక్, ఇనుము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో గుడ్లను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.
శరీరానికి వెరీ గుడ్డు ఆహారపదార్థమైన గుడ్ల వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. గుడ్లలో ఉండే బోలెడన్ని పోషకాల వలన కొలెస్ట్రాల్ కూడా అధికంగా పెరిగిపోతుంది. తద్వారా గుండెపోటు వచ్చే చాన్సెస్ ఉంటాయి. హార్ట్ హెల్దీనెస్ పైన దెబ్బ పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఏదేని వస్తువు పరిమితికి మించి తీసుకుంటే ఇబ్బంది కరమే కదా..అలా పరిమితికి మించి గుడ్లను తీసుకుంటే కనుక ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం ఇతర జీర్ణ సమస్యలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బ తినకుండా ఉండాలంటే పరిమితిగానే గుడ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పైబడిన వారు ఎగ్స్ పరిమితికి మించి తీసుకున్నట్లయితే డైజేషన్ ఇష్యూస్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి పరిమితిలోనే గుడ్లను ఆహార పదార్థాలుగా తీసుకోవాలి.
ఇకపోతే అప్పుడప్పుడు కొందరు ఉడకని లేదా పచ్చి గుడ్లను కూడా ఆహారంలో భాగం చేసేసుకుంటారు. కానీ, అలా చేయకూడదు. అలా పచ్చివి, ఉడకని ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్సెస్ మెండుగా ఉంటాయి. కాబట్టి పచ్చి గుడ్డు తినడం, ఉడికీ ఉడకని గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడం అస్సలు చేయకూడదు. డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఎగ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం పైన ఉండే తెల్లటి సొనను మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా మొత్తంగా ఎగ్ ను తింటే ఎలర్జీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Recommended Videos