https://oktelugu.com/

Health Care: శరీరంలో వేడికి చెక్ పెట్టాలనుకుంటున్నారా.. తినాల్సిన ఆహార పదార్థాలివే?

Health Care: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా ఎండలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వేసవికాలంలో శరీరం చల్లగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వేసవికాలంలో కారం, ఫ్రైలు ఎకువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. వేసవిలో సెనగలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సెనగలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మాంసకృత్తులు సులువుగా లభిస్తాయి. సెనగలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వేసవిలో శరీరం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 3, 2022 / 08:52 AM IST
    Follow us on

    Health Care: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా ఎండలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వేసవికాలంలో శరీరం చల్లగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వేసవికాలంలో కారం, ఫ్రైలు ఎకువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. వేసవిలో సెనగలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

    సెనగలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మాంసకృత్తులు సులువుగా లభిస్తాయి. సెనగలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. సెనగలతో తయారు చేసిన సత్తు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వేసవిలో మినుములు తీసుకుంటే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మినప పప్పులో శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్లతో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయి.

    మినప పప్పు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆస్తమా లేదా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యానికి పెసర పప్పు కూడా చాలా మంచిది. పెసర పప్పు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు లభించే అవకాశం ఉంటుంది. పెసరపప్పు రుచిగా ఉండటంతో పాటు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.

    వేసవిలో వీటిని డైట్ లో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కడుపులో మంట, శరీరంలో వేడి సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. లస్సీలు, జ్యూస్ లు, షర్బత్ లు తాగడం కంటే వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.