https://oktelugu.com/

Sugarcane Juice: చెరుకు రసం ఓ ఔషధం.. పైగా ఎన్నో ఉపయోగాలు !

Sugarcane Juice: పది రూపాయల చెరకు రసం వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.చెరకు రసంలో ఉండే గ్లూకోజ్ ను, శరీరం చాలా వేగంగా తీసుకుని వెంటనే ఉపయోగించుకుటుంది. అందుకే చెరకు రసం తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. అలాగే చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చెరకు రసం ఔషధం కూడా. ముఖ్యంగా కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 17, 2022 / 11:31 AM IST
    Follow us on

    Sugarcane Juice: పది రూపాయల చెరకు రసం వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.చెరకు రసంలో ఉండే గ్లూకోజ్ ను, శరీరం చాలా వేగంగా తీసుకుని వెంటనే ఉపయోగించుకుటుంది. అందుకే చెరకు రసం తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. అలాగే చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

    Sugarcane Juice

    చెరకు రసం ఔషధం కూడా. ముఖ్యంగా కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం వినియోగం దోహదం చేస్తుంది.చెరకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్ లు సమృద్ధిగా ఉంటాయి.ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరకు రసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ మరియు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది

     

    అన్నిటికి మించి, వేసవి కాలంలో చెరకు రసం తాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్ల బరుస్తుంది. పైగా క్యాలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువ గనుక ఊబకాయులూ తీసుకోవచ్చు.

    అదే విధంగా చెరకు రసం.. ఆకట్టుకునే రుచితో పాటు, అందుబాటు ధరలో ఉంటుంది గనుక అందరూ వాడొచ్చు. చెరకు రసంలో నిమ్మ, అల్లం రసం గానీ, కొబ్బరి నీరు గానీ కలుపుకొని తాగితే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి.. మీకు చెరుకు రసం కనిపిస్తే వెంటనే వెళ్లి తాగండి. అది ఎంతగానో మేలు చేస్తోంది. పైగా చాలా తక్కువ ధరకే వస్తోంది.

     

    Tags