
సాధారణంగా ఆలివ్ ఆయిల్ తో చేసే వంటల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. ఆలివ్ ఆయిల్ వల్లే కాదు ఆలివ్ వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. నలుపు, ఆకుపచ్చ రంగులలో లభ్యమయ్యే ఆలివ్ ద్వారా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి ఆలివ్ ద్వారా విటమిన్-ఇ, విటమిన్ కె, ఐరన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. గ్రీన్ ఆలివ్ లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఎవరైతే గ్రీన్ ఆలివ్ ను తీసుకుంటారో వాళ్లు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడే గ్రీన్ ఆలివ్ లను ఎలాంటి ఆహారంతోనైనా కలిపి తీసుకోవచ్చు. ఆలివ్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గ్రీన్ ఆలివ్ లలో ఎక్కువగా ఉంటాయి.
ఊబకాయం సమస్యతో బాధ పడేవాళ్లు గ్రీన్ ఆలివ్ లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కొవ్వు ఆమ్లాల కొలెస్ట్రాల్ స్థాయిని గ్రీన్ ఆలివ్ తోడ్పడుతుంది. ఆలివ్ జీర్ణవ్యవస్థను సున్నితంగా చేయడంలో సహాయపడటంతో పాటు ప్రోబయోటిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలుస్తోంది. రక్తపోటును తగ్గించడంలో ఆలివ్ తోడ్పడుతుంది. శరీరంలోని మంటను తగ్గించడంలో ఆలివ్ సహాయపడుతుంది.
ఆలివ్ తీసుకోవడం వల్ల అతిగా తినడాన్ని సులభంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. అలర్జీలను తగ్గించడంలో ఆలివ్ ఎంతగానో సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండే ఆలివ్ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా కూడా పని చేస్తుందని తెలుస్తోంది.