Hing Water: మన దేశంలోని ప్రజలు తయారు చేసే వంటకాలలో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉందనే విషయం తెలిసిందే. మన దేశంలో వినియోగించే సుగంధ ద్రవ్యాలలో ఇంగువ ఒకటి కాగా ఇంగువ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఔషధాల తయారీలో ఇంగువను ఎక్కువగా వినియోగిస్తారనే విషయం తెలిసిందే. సనాతన ఆయుర్వేదంలో ఇంగువను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టడంలో ఇంగువ తోడ్పడుతుంది.
మహిళలలో చాలామంది రుతుస్రావపు నొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. పొత్తికడుపునొప్పి, రుతుస్రావానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడంలో ఇంగువ ఉపయోగపడుతుంది. శరీరంలో రక్తం సజావుగా ప్రవహించేలా చేయడంలో ఇంగువ ఉపయోగపడుతుంది. వెన్నెముక, పొత్తి కడుపు నొప్పిని ఇంగువ వినియోగించడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇంగువ తలనొప్పితో పాటు రక్తనాళాల వాపును తగ్గిస్తుంది.
ఇంగువను వేడినీటిలో కలుపుకుని తాగడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. జలుబు చేసిన సమయంలో ఇంగువ కలిపిన నీటిని తాగడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది. ఇంగువ నీరు శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు చలి నుంచి కాపాడి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. ఇంగువ వాటర్ తాగడం వల్ల జీవక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇంగువ వాటర్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గించడంలో ఇంగువ వాటర్ ఉపయోగపడుతుంది. ఇంగువ వాటర్ వాడటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి. పీహెచ్ స్థాయిని సాధారణం చేయడంలో ఇంగువ వాటర్ తోడ్పడుతుంది.