Curd Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్నింటిని తీసుకోవాలి. మన శరీరానికి ఆరోగ్యం కలిగించే వాటి విషయంలో నిర్లక్ష్యం వద్దు. వాటితో మనకు ఎన్నో లాభాలుంటాయి. జామ పండు తింటే జలుబు చేస్తుందని, పెరుగు తింటే బరువు పెరుగుతారని అపోహలు పడుతుంటారు. అందులో నిజం లేదు. పెరుగు మనకు చాలా అవసరమైన ఆహారం. దీన్ని రోజు తీసుకోవడం వల్ల మనకు మంచి ప్రయోజనాలు కలుగుతాయని కానీ నష్టాలు మాత్రం రావు. ఇది తెలుసుకుని రోజువారీ ఆహారంలో పెరుగు చేర్చుకోవాల్సిన అవసరం గుర్తించాలి.
పెరుగులో ఏముంది?
పెరుగులో మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఒకరోజు పులియబెట్టిన పెరుగుతో మనకు చాలా లాభాలు ఉంటాయి. పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. దీంతో కాల్షియం ఎక్కువ ఉండటంతో ఎముకల బలానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇందులో ఎండు ద్రాక్ష వేసుకుని తింటే విటమిన్ ఎ,సి,ఇ, బి2, బి12 విటమిన్లతో పాటు కెరోటోనాయిడ్లు అందుతాయి. అందుకే పెరుగును దూరం పెట్టకుండా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఏం దూరం చేసుకోవచ్చు
పెరుగు తినడం ద్వారా వాత, పిత్త, కఫ రోగాలు దూరమవుతాయి. దగ్గు, జలుబు సమస్యలతో బాధపడే వారికి అందులో కాస్త మిరియాల పొడి, బెల్లం కలుపుకుని తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. నీరసం, మూత్రాశయ సమస్యలతో బాధపడే వారికి కూడా పెరుగులో చక్కెర కలుపుని తింటే పరిష్కారం లభిస్తుంది. పెరుగును రోజు తింటే శరీరం బలంగా మారుతుంది.
జీర్ణాశయ సమస్యలకు..
పెరుగు మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోతే ఎసిడిటి, గ్యాస్ సమస్యలు వస్తాయి. పుల్లటి తేన్పులు రావడం సహజం. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే పెరుగు తీసుకోవడమే ఉత్తమం. ఇలా పెరుగుతో మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని తెలుసుకుని పెరుగును కచ్చితంగా తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.