
మన శరీరంలో జరిగే మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. కొన్ని లక్షణాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో ఏదో ఒక భాగంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు రావడం జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు తిమ్మిర్లు రావడంలో ఆశ్చర్యం లేకపోయినా తరచూ తిమ్మిర్లు వస్తే మాత్రం ప్రమాదకరం అని వైద్యులు చెబుతుండటం గమనార్హం.
సాధారణంగా నరాలకు మెదడు నుంచి సంకేతాలు సరఫరా అవుతుంటాయి. మన శరీరంలో ఏ భాగంలో తిమ్మిర్లు వస్తాయో ఆ భాగానికి వెళ్లే నరాల సరఫరా ఆగిపోతుందని అర్థం. నరంపై తిమ్మిర్ల వల్ల ఒత్తిడి పడితే రక్తం సరఫరా ఆగిపోవడంతో పాటు చెయ్యికి ఆక్సిజన్, పోషకాలు అందడం నిలిచిపోయి చెయ్యి చచ్చుబడినట్లు అవుతుంది. రోజుల తరబడి తిమ్మిర్లు వస్తున్నాయంటే నరాలు దెబ్బతిన్నాయని అర్థం చేసుకోవాలి.
రాత్రివేళ నిద్రపోయే సమయంలో మెడను పద్దతిగా ఉంచుకుని పడుకుంటే ఈ సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు సెర్వికల్ ఎం.ఆర్.ఐ చేయించుకుంటే మంచిది. ఎక్కువ సేపు కంప్యూటర్ దగ్గర కూర్చున్నా భుజాల దగ్గర ఉండే నరాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యను థొరాసిక్ ఔట్లెట్ సిండ్రోమ్ అంటారు. భుజాల వ్యాయామాలు చేయడం ద్వారా మధ్యమధ్యలో అటూఇటూ తిరగడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
నడుం దగ్గర అసలైన చెయ్యికి సంబంధించిన నరం దెబ్బ తింటే కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. పదేపదే తిమ్మిర్లు వస్తుండటం, లేదా తెల్లారి లేచాక తరచూ తిమ్మిరులు వస్తుంటే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది.