పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినిమా రావాలంటే.. మినిమం ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే. ఏడాదిపైన ఎంత సమయం పడుతున్నది లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. రీ-ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్.. అందరితో వామ్మో అనిపించారు. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం లైన్లోకి మరొకటి వచ్చి చేరింది.
రీ-ఎంట్రీ మొదటి మూవీ వకీల్ సాబ్ తో తన స్టామినా ఏంటో చాటిచెప్పాడు పవన్. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని హద్దుల్లేకుండా పోయాయి. ఆ తర్వాత అయ్యప్పనుమ్ కోషియం రీమేక్, హరిహర వీరమల్లు చిత్రాలు రానున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ రెండు చిత్రాలను కంప్లీట్ చేయాలని భావించిన పవన్.. ఉదయం ఓ షూట్లో.. మధ్యాహ్నం మరో సెట్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో సెకండ్ వేవ్ తరుముకొచ్చి షూటింగులు ఆపేసింది.
రీ-ఓపెన్ తర్వాత మళ్లీ ఇదే పద్ధతిలో రెండు సినిమాలను ఏకకాలంలో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా మొదలు కానుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ స్క్రిప్టుతో తెరకెక్కబోతోందని, అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ చెప్పడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.
ఈ చిత్రం తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేయబోతున్నాడట పవన్. పూరీ దర్శకుడిగా పరిచయం అయ్యిందే పవన్ సినిమాతో. వీరిద్దరూ కలయికలో వచ్చిన ‘బద్రి’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చినప్పటికీ.. సరిగా ఆడలేదు. ఇప్పుడు మూడో సినిమా రాబోతోందని టాక్. ఓ బడా ప్రొడ్యూసర్ ఈ ప్లాన్ చేస్తున్నారట. పవన్ ఓకే చెప్పడమే మిగిలి ఉందని అంటున్నారు.
అది కూడా మహేష్ కోసం రాసిన కథతో ఈ సినిమా తీయబోతున్నాడని అంటున్నారు. అప్పుడెప్పుడో ‘జనగణమన’ స్క్రిప్టు రాసుకున్నాడు పూరీ. మహేష్ తో చేయాలనుకున్నా.. కుదరలేదు. ఇప్పుడు దాన్ని పవన్ కు ఇచ్చేస్తున్నాడని అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 3rd movie from pawan and puri
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com