Health Tips: మనిషి జీవిత కాలంలో ఏదొక సమయంలో కిడ్నీలో రాళ్లు వస్తాయని అంటుంటారు. శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. అందుకే మూత్రపిండాలు చాలా కీలకం. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు మూత్రపిండాలు తొలగిస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొందరిలో మూత్రపిండాల్లో చిన్న రాళ్లు ఉంటాయి. అవి చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. మరి వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. కొన్ని చిట్కాలు మీ కోసం..
1. కొండ పిండి సమూల కాషాయం తాగినా చాలు, కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
2. ఇక అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జన తో పాటు బయటకు వచ్చేస్తాయి.
3. ఆరు నెలల పాటు రెండు పూటలా మూడు చెంచాల తులసి రసాన్ని తేనేలో కలిపి తాగినా కిడ్నీలో రాళ్లు బయటకు వచ్చేస్తాయి.
4. అలాగే క్యాల్షియం సిట్రేట్ కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే గొప్ప లక్షణం ఉంది.
Also Read: ఒమిక్రాన్ సోకిన వాళ్లకు షాకింగ్ న్యూస్.. కంటిలో ఆ మార్పులు కనిపిస్తాయట!
5. మీకు తెలుసా ? కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించి, ఆ నీటిని ప్రతి రోజు తాగినా.. కిడ్నీల్లో రాళ్లు కచ్చితంగా కరిగిపోతాయి.
6. మొక్కజొన్న పొత్తులతో ఉండే పీచుని 40 గ్రాములు తీసుకుని, అరలీటరు నీళ్లలో నానబెట్టి రెండు గంటల తరువాత వడపోసుకొని తాగినా కిడ్నీల్లో రాళ్లు కచ్చితంగా కరిగిపోతాయి.
7. అదే విధంగా, రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే తాగినా చాలు, కిడ్నీలో ఉన్న రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.
అసలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండలాంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.
Also Read: రూ.28 వేలకే కొత్త స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం.. ఎలా అంటే?