Hair Health: శిరోజాలు అమ్మాయిలకు చాలా ముఖ్యం. వీటివల్లే చాలా వరకు అమ్మాయిలు అందంగా కనిపిస్తారు. అందుకే బ్యూటీ కేరింగ్‌లో హెయిర్ స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అమ్మాయి. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌లో పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జుట్టు రాలడం, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా మారడం వంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే జట్టుకు మంచి పోషణ అందివ్వాలి. కొన్ని రకాల విత్తనాల్లో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవిజట్టుకు సరైన పోషణ అందించి, కురులను బలంగా ఉండచంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఐదు రకాల విత్తనాల్లో పోషకాలు, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ఖనిజాలు, ఎక్కువగా ఉంటాయి. ఇవ కుదుళ్లను బలోపేతం చేసి.. ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. మరి హెల్తీ హెయిర్ కోసం డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆ ఐదు రకాల సీడ్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.
గుమ్మడి విత్తనాలు : గుమ్మడి విత్తనాల్లో జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇన్‌ఫ్లషన్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మాడ ఆరోగ్యాన్ని బెటర్ గా ఉంచుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు : జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన పోషకాలు ఈ విత్తనాల్లో ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, సెలీనియం వంటి న్యూట్రియెంట్స్ స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి,ప్రొటీన్, ఇతర సమ్మేళనాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతూ.. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
అవిసె గింజలు : స్కాల్ప్(తలచర్మం) ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వంటివి జుట్టు, స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ యాసిడ్స్ అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో ఉండే లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీర కణాలను రక్షిస్తాయి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే అవిసె గింజలను క్రమం తప్పకుండా ఆహారంలో యాడ్ చేసుకోవాలి.
జనపనార విత్తనాలు : జనపనార విత్తనాల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
చియా విత్తనాలు : చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాల్లో ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కురుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నువ్వులు : నువ్వుల్లోని విటమిన్-ఇ, స్కాల్ప్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నువ్వుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలను తగ్గించగలవు. జుట్టు చివర్లు చిట్లిపోకుండా రక్షిస్తాయి.
Web Title: For your hair to be healthy it is enough to have these in your diet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com