
దేశంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారు అధిక కొలెస్ట్రాల్ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడంతో పాటు మనస్సు ప్రశాంతతపై కూడా తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే దాన్ని అధిక కొలెస్ట్రాల్ స్థితి అని అంటాం.
ఆరోగ్యకరమైన జీవన విధానానికి కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ ఎంతగానో అవసరం. మీకు ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ ఉంటే అనారోగ్యకర అలవాట్లను మానుకోవడం మంచిది. బర్గర్లు, పిజ్జాలలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి. అవకాడోలు, నెయ్యి, కొబ్బరికాయలో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి మంచివి. మీరు మాంసాహారులైతే చికెన్, సముద్రపు ఆహారం తింటే మంచిది.
కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కేకులు, తెల్ల బ్రెడ్, బేకరీ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. వీటికి బదులుగా డైట్ లో మొలకలు, పండ్లు, ఆకు కూరలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను మరింత పెంచే అవకాశం అయితే ఉంటుంది. కఠినమైన డైట్, వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు కూడా ఉంటాయి.