మనలో చాలామంది ఐరన్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మరింత తగ్గితే రక్తహీనత రావడంతో పాటు ఎముకలు బలహీనపడే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని సులభంగా అధిగమించే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎండు ద్రాక్ష ఐరన్ లోపానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.
రాత్రి సమయంలో ఎండు ద్రాక్షలను నీళ్లలో నానబెట్టి ఉదయం తినడం ద్వారా ఐరన్ లోపాన్ని సులభంగా అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎండు ద్రాక్ష ద్వారా శరీరానికి అవసరమైన రాగి, విటమన్లు లభిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉండగా ఎండు ద్రాక్షలలో ఐరన్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఉసిరి సూపర్ ఫుడ్స్ లో ఒకటి కాగా ఉసిరి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి, ఐరన్, కాల్షియం లభిస్తాయి.
ఐరన్ పుష్కలంగా ఉండే ఉసిరి రక్తహీనత సమస్యను సైతం దూరం చేస్తుంది. ఉసిరిని పచ్చిగా ఉడకబెట్టి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజూ ఉసిరి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన వాటిలో బెల్లం కూడా ఒకటి. రోజువారీ ఆహారంలో బెల్లంను చేర్చుకుంటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. షుగర్ కు బదులుగా కాఫీ లేదా టీలో బెల్లం వాడితే మంచిది.
జంతువుల లివర్, కిడ్నీ, గుండె, మెదడులో శరీరానికి కావాల్సిన ఐరన్ ఉంటుంది. అప్పుడప్పుడూ వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కండరాలకు ఎంతో మేలు చేసేవాటిలో బచ్చలికూర కూడా ఒకటి కాగా బచ్చలికూరలో శరీరానికి అవసరమైన ఐరన్ ఉంటుంది. వారానికి రెండుసార్లు బచ్చలికూరను తీసుకుంటే ఐరన్ లోపంకు చెక్ పెట్టవచ్చు.