Sleep Tips: నిద్ర సరిగా పట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి

నిద్ర సమస్యలను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. వాటితో నిద్ర పట్టకుండా చేసే సమస్యలను తగ్గించుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : May 16, 2023 12:23 pm

Sleep Tips

Follow us on

Sleep Tips: మనకు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర లేకపోతే ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో సరైన పద్ధతుల్లో ఉండకపోతే నిద్ర రాకుండా పోతుంది. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. చాలా మందికి నిద్ర సమస్యగా మారుతోంది. అర్థరాత్రి సమయంలో పీడకలలు వంటివి రావడంతో మెలకువ వచ్చి నిద్ర పట్టదు. దీంతో పగలంతా అలసట, నీరసంగా ఉంటుంది. రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర ప్రధానంగా ఉంటుంది.

నిద్ర సమస్యలను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. వాటితో నిద్ర పట్టకుండా చేసే సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనికి గాను రెండు యాలకులను దిండు కింద పెట్టుకుని పడుకుంటే మనల్ని భయపెట్టే కలలు రాకుండా పోతాయి. దీని వల్ల నిద్రలో మనకు పీడకలలు రాకుండా ఉంటాయి. నిద్రలో ఉన్నప్పుడు మనల్ని భయపెట్టే కలలు రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

పడుకునే ముందు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా దుష్టశక్తులు ఉన్నా అవి మీద పనిచేయవు. కాళ్లు కడుక్కుంటే ఆ పాద ధూళిలో అన్ని పోతాయి. పడక గదిలో నెగెటివ్ ఎనర్జీ లేకుండా చూసుకుంటే రాత్రి పూట సుఖమైన నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీళ్లు ఉంచుకుని ఉదయాన్నే వాటిని మొక్కలకు పోయాలి.

ప్రతి రోజు చెంబులో నీళ్లు పెట్టుకోవడం ద్వారా మనకు నిద్రాభంగం కలగదు. నెగెటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనకు నిద్ర పట్టకుండా చేయదు. దీంతో మనం హాయిగా నిద్రపోవచ్చు. స్త్రీలు పడుకునే సమయంలో జుట్టు విరబోసుకోకూడదు. దగ్గరకు ముడుచుకుంటే మంచిది ఇలా చేస్తేనే మనకు మంచి నిద్ర పట్టేందుకు సాధ్యమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.