Egg: పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు గుడ్లను అందరూ ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. గుడ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వైద్యులు సైతం కోడిగుడ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచనలు చేస్తూ ఉంటారు. మాంసాహారం తినని వాళ్లలో చాలామంది గుడ్లను మాత్రం తింటారు. మనలో చాలామంది గుడ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా నిల్వ చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుడ్లను ఒకవేళ ఫ్రిడ్జ్ లో కచ్చితంగా నిల్వ చేయాలని అనుకుంటే బాక్స్ లో ఉంచి నిల్వ చేస్తే మంచిది. గుడ్లను సైడ్ ర్యాక్ లో ఉంచి నిల్వ చేయడం కరెక్ట్ కాదు. గుడ్లను నిల్వ చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. కోడిగుడ్లను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది. ఫ్రిడ్జ్ లో ఇతర వస్తువులకు తగిలేలా గుడ్లను ఉంచితే ఆ వస్తువులకు గుడ్ల వాసన అంటుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మరీ ఎక్కువగా గుడ్లను తినడం వల్ల నష్టమేనని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. గుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల దుష్ప్రభావాలు ఉన్న నేపథ్యంలో వీలైతే సాధారణ వాతావరణంలోనే గుడ్లను నిల్వ చేస్తే మంచిదని చెప్పవచ్చు.