Diabetes Precautions: షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

మధుమేహం ఉన్న వారు అల్కహాల్ తీసుకోకూడదు. పొగ తాగకూడదు. ఈ అలవాట్లు ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బంగాళాదుంప, మొక్కజొన్న, బఠాణీలు తక్కువగా తీసుకోవాలి. మనకు బలం చేకూర్చే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

Written By: Srinivas, Updated On : June 24, 2023 5:40 pm

Diabetes Precautions

Follow us on

Diabetes Precautions: ప్రస్తుత రోజుల్లో అందరికి షుగర్ వేగంగా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వ్యాధి వ్యాపిస్తోంది. ఒకసారి వచ్చిందంటే షుగర్ జీవితాంతం మన వెంట ఉండాల్సిందే. మందులు వేసుకుంటూనే ఉండాలి. ఈ నేపథ్యంలో మధుమేహం ఒకసారి వచ్చిందంటే మందులు వాడుకుంటూ పోవాలి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. షుగర్ వచ్చిందంటే నెలకోసారి చెక్ చేసుకోవాలి.

డయాబెటిస్ వస్తే ఏం తినాలి

చక్కెర వచ్చాక కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. తరచుగా మూత్ర విసర్జన, ఆకలి ఎక్కువగా వేయడం, కళ్లు సరిగా కనిపించకపోవడం, తూలినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ వ్యాధి వచ్చినట్లు నిర్ధారించుకోవాలి. షుగర్ వచ్చిన వారు స్వీట్లు తినకూడదు. తియ్యగా ఉండే పండ్లు తినకూడదు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినొచ్చు.

జీవనశైలి

మన జీవన శైలిని మార్చుకోవాలి. ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే మంచిది. వ్యాధి రాకముందు అన్నం ఎక్కువగా తిన్న వారు డయాబెటిస్ వచ్చిందంటే మన ఆహార అలవాట్లు సరిగా చూసుకోవాలి. లేకపోతే షుగర్ పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డైట్ ను కచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అవసరమైన ఆహారాలు తీసుకోవాలి.

అల్కహాల్ కు దూరంగా ఉండాలి

మధుమేహం ఉన్న వారు అల్కహాల్ తీసుకోకూడదు. పొగ తాగకూడదు. ఈ అలవాట్లు ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బంగాళాదుంప, మొక్కజొన్న, బఠాణీలు తక్కువగా తీసుకోవాలి. మనకు బలం చేకూర్చే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

వ్యాయామం

డయాబెటిస్ కు గురైన వారు వ్యాయామం చేయాలి. దీంతో గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు పెరుగుతాయి. దీంతో వ్యాయామం చేస్తే షుగర్ తగ్గుతుంది. చక్కెర నియంత్రణలో ఉంచుకునేందుకు మనం పలు రకాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మధుమేహం నియత్రణలోకి వస్తుంది. ఈ క్రమంలో షుగర్ ను అదుపులో ఉంచుకునేందుకు చొరవ చూపాల్సిందే.