https://oktelugu.com/

vitamin D : ఫిష్ ఆయిల్ విటమిన్ డి లోపాన్ని సరిచేస్తుందని తెలుసా?

vitamin D : మనకు ఆరోగ్యకరమైన ఆహారాల్లో చేపలు ఉంటాయి. చేపల్లో ప్రొటీన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో వాటిని తీసుకోవడం మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేపలను తినేందుకు మొగ్గు చూపాల్సిందే. మటన్ 72 గంటలు, చికెన్ 32 గంటలు, చేపలు 7 గంటల్లో జీర్ణం అవుతాయి. అందుకే చేపలను మన ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. మాంసాహారాల్లో చేపలకు మంచి విలువ ఉంటుంది. దీంతో వాటిని వారంలో కనీసం రెండు సార్లయినా తీసుకుంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2023 / 05:12 PM IST
    Follow us on

    vitamin D : మనకు ఆరోగ్యకరమైన ఆహారాల్లో చేపలు ఉంటాయి. చేపల్లో ప్రొటీన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో వాటిని తీసుకోవడం మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేపలను తినేందుకు మొగ్గు చూపాల్సిందే. మటన్ 72 గంటలు, చికెన్ 32 గంటలు, చేపలు 7 గంటల్లో జీర్ణం అవుతాయి. అందుకే చేపలను మన ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. మాంసాహారాల్లో చేపలకు మంచి విలువ ఉంటుంది. దీంతో వాటిని వారంలో కనీసం రెండు సార్లయినా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

    వైద్యులు సైతం ఇటీవల చేప మాత్రలు వాడమని సూచిస్తున్నారు. ఫిష్ టాబ్లెట్ కాడ్ ఫిష్ అని ఓ రకమైన చేపల కాలేయం నుంచి తయారు చేసే మాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని కాడ్ లివర్ ఆయిల్ అని కూడా చెబుతారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటంతో మనకు మేలు కలుగుతుంది. చేపల ఆయిల్ తో మనకు ఒనగూరే ప్రయోజనాలే ఎక్కువ. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే చేపల ఆయిల్ ను ఇస్తారు. దీంతో మనం డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.

    విటమిన్ డి లోపం ఉన్న వారికి ఈ మాత్రలు సిఫారసు చేస్తారు. విటమిన్ డి లోపం వల్ల ఇతర పోషకాలను గ్రహించి అవయవాలకు పంపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం, రోగనిరోధక శక్తి, కణాల పెరుగుదలకు సాయపడుతుంది. విటమిన్ డి పుష్కలంగా ఉండే ఫిష్ ఆయిల్ టాబ్లెట్లను వైద్యులు సిఫారసు చేస్తుంటారు. విటమిన్ ఎ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపుకు ఇబ్బందులు కలగకుండా చేయడంలో విటమిన్ ఎ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.

    ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది. మన బరువు తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇంకా వైరస్ తో పోరాడుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. వాటిని నాశనం చేయడంలో సాయపడుతుంది. ఫిష్ ఆయిల్ ను వైద్యులు ఎక్కువగా సూచిస్తున్నారు. దీంతో ఫిష్ మనకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఆహారంలో కూడా వాటిని చేర్చుకోవడం ఎంతో మేలు కలిగిస్తాయని తెలుసుకున్నాం. రోజు వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.