మారుతున్న జీవనశైలి వల్ల చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కొంతమంది చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. శ్వాస తీసుకోవడం, గుండెల్లో మంట లాంటి సమస్యల వల్ల చాలామంది బాధ పడుతున్నారు. అయితే గుండెల్లో మంట సమస్యతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెల్లో మంట సమస్యకు చెక్ పెట్టవచ్చు.
వీటిలో ఉండే కాల్షియం వల్ల కడుపు బరువుగా ఉండటంతో పాటు ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. పాలలో ఉండే ఒక రకం షుగర్ ను లాక్టోజ్ అని అంటారు. లాక్టోజ్ ను జీర్ణం చేసే ఎంజైమ్ లు తక్కువగా ఉంటే గుండెలో మంట కలిగే ఛాన్స్ ఉంది. పప్పులు, రాజ్మా, బీన్స్ లో అలిగో శాచురేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా కూడా గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
క్యాబేజ్, బ్రకోలి, ముల్లంగిని జీర్ణం చేసే ఎంజైమ్ మానవులలో ఉండదు. వీటి వల్ల చిన్నప్రేగుల్లో గ్యాస్ సమస్య కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సిట్రస్ పండ్ల రసాల వల్ల అజీర్ణంతో బాధ పడే అవకాశం ఉండటంతో పాటు ఇతర సమస్యలు వస్తాయి.