https://oktelugu.com/

Bank Tips: ఈ చిట్కాలు పాటించకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయమయ్యే ఛాన్స్.. అవేంటంటే?

Bank Tips: ఈ మధ్య కాలంలో డబ్బులు మోసపోతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయిలో పుంజుకుంటున్నాయి. ఇదే సమయంలో మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలను చేసేవాళ్లు హెచ్.టీ.టీ.పీ.ఎస్. తప్పనిసరిగా ఉన్న బ్యాంక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 25, 2022 / 08:17 PM IST
    Follow us on

    Bank Tips: ఈ మధ్య కాలంలో డబ్బులు మోసపోతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయిలో పుంజుకుంటున్నాయి. ఇదే సమయంలో మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.

    ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలను చేసేవాళ్లు హెచ్.టీ.టీ.పీ.ఎస్. తప్పనిసరిగా ఉన్న బ్యాంక్ వెబ్ సైట్లలో మాత్రమే లావాదేవీలను చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఆన్ లైన్ లావాదేవీలను అత్యవసరమైనా ఓపెన్ వైఫైల ద్వారా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఆన్ లైన్ లావాదేవీలను ఇంటర్నెట్ కేఫ్ ద్వారా చేయడం కూడా సరి కాదు. బ్యాంక్, యూపీఐ లావాదేవీల కోసం కఠినమైన పాస్ వర్డ్ లను వినియోగించాలి.

    ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి బ్యాంక్ పాస్ వర్డ్ లను మార్చడం ద్వారా లావాదేవీలను జరిపే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉండదు. బ్యాంకు అధికారులమని ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ లో వివరాలను చెప్పకుండా డైరెక్ట్ గా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి సంప్రదిస్తే మంచిది. ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ లలో బ్యాంక్ ఖాతా వివరాలు సేవ్ కాకుండా జాగ్రత్త పడాలి.

    నమ్మకమైన ఈకామర్స్ వెబ్ సైట్లలో మాత్రమే షాపింగ్ చేయాలి. కీప్యాడ్ ను కవర్ చేస్తూ ఏటీఎం పిన్ ను ఎంటర్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. నగదు బదిలీకి మాత్రమే యూపీఐ పిన్ ను ఎంటర్ చేయాలి. ఏవైనా లావాదేవీలు మీ ప్రమేయం లేకుండా జరిగితే యూపీఐ సేవలను డిసేబుల్ చేయాలి. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలనే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పవచ్చు.