Fruits and Vitamins: మనం తినే ఆహారమే మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా తాజా పండ్లకు ఎంతో శక్తి ఉంటుంది. రోగాలను సైతం తగ్గించే శక్తి వాటిల్లో ఇమిడి ఉంటుంది. మరి ఏ పండు తింటే ఏ జబ్బు తగ్గుతుందో తెలుసుకుందాం రండి.
మీకు కండరాలు, నరాల బలహీనత సమస్యలు ఉంటే.. జామకాయలు ఎక్కువగా తినాలి. నరాల బలహీనత తగ్గిపోతుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తరచుగా కూరల్లో టమాటాలు వాడాలి.
Also Read: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఎవరు ఎక్కడి వారు.? ఆయన గొప్పతనం ఏంటో తెలుసా?
ఇక కిడ్నీల్లో రాళ్లు తొలగిపోవాలంటే ఏ పండు తినాలో తెలుసా ? మామిడి పండు. అవును మామిడి పండ్లు ఎక్కువగా తింటే మీకు కిడ్నీల్లో రాళ్లు రావు.
అలాగే మీకు కడుపులో పురుగులు ఎక్కువగా ఉన్నాయా ? మరి ఆ పురుగులు పోవాలంటే ఏమి తినాలో తెలుసా ? నేరేడు పండ్లను ఎక్కువగా తినాలి. నేరేడు పండ్లకు పురుగులను చంపే శక్తి ఉంటుంది.
గుండె, చర్మ సమస్యలను పుచ్చకాయ నయం చేస్తోంది.
పెద్దవాళ్లకు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. మరి ఆ నొప్పులకు చెక్ పెట్టాలంటే ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినండి.
మీరు పైల్స్ సమస్యతో బాధ పడుతున్నారా ? అయితే బొప్పాయి తినాలి. ఆ సమస్య తగ్గిపోతుంది.
మీరు అధిక రక్తపోటు ఉన్నా, నరాల బలహీనత ఉన్నా ఎక్కువగా జీడిపప్పు తినండి. జీడిపప్పు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
Also Read: మూవీ టైమ్ : ‘నాని’ నుంచి గుడ్ న్యూస్.. సంపూ నుంచి ‘ధగడ్ సాంబ’ !