Health Tips: కాలంతో పాటు మనిషి జీవనశైలి మారుతూ వస్తోంది. ఐతే, మారుతున్న జీవనశైలి కారణంగా తాజాగా వండుకుని తినే సమయం లేదు నేటి తరానికి. వండిన వాటినే రెండోసారి వేడి చేసుకుని కుటుంబ సభ్యులకు పెట్టే గృహలక్ష్మిలే ఎక్కువమంది ఉన్నారు. చాలా ఇళ్లల్లో తరుచూ చేసే పొరపాట్లు ఇవి. వేపుళ్లకి వాడిన నూనెను ఇతర పదార్థాల తయారీకి కూడా వాడతారు. ముఖ్యంగా కూరలని, మాంసాహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి వడ్డించడం ఆరోగ్యానికి మంచిది కాదు.
మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండెకు చేటు :
పండుగలప్పుడు ఇంట్లో కార్యక్రమాల సమయాల్లో పిండి వంటలు చేస్తారు. పెద్ద కడాయి నిండా నూనె వేసి రకరకాల పదార్థాలు వండే క్రమంలో నూనె మిగులుతుంది. అయితే, ఆ మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. కానీ, ఒకసారి నూనెని స్మోక్ పాయింట్ వరకు వేడిచేస్తే దానిలో రసాయన చర్య జరిగి స్వభావం మారుతుందనే విషయం మీరు తెలుసుకోవాలి.
Also Read: యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది !
మళ్లీ ఆ నూనె తో వేడి చేస్తే అందులో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నూనెతో చేసిన పదార్థాలను తినడం వల్ల గుండె జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. రోడ్డుపై అమ్మే పదార్థాలలో ఎక్కువగా ఇలాంటి నూనెతో వంట చేస్తారు. అలాగే కొన్ని రెస్టారంట్ లలోని ఆహారం పట్ల కూడా జాగ్రత్త అవసరం. మెయిన్ గా స్వీట్లు, బజ్జీల వంటివి తినేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంట్లో వాడే సోయా, వెజిటబుల్ నూనెల్ని మళ్లీమళ్లీ వేడి చేయకూడదు.
అన్నాన్ని వేడి చేసి తిన్నా ఇక అంతే సంగతులు :
వండిన అన్నం వండినట్టే ఉంది అని ఆడవాళ్లు తెగ బాధ పడిపోతూ ఉంటారు. ఆ అన్నాన్ని అస్సలు పారేయలేరు. పైగా బియ్యం బోలెడు ఖరీదు. అందుకే.. తిరిగి ఆ అన్నాన్ని వేడి చేస్తుంటారు. కానీ ఆ అన్నాన్ని సరిగ్గా భద్రపరచకున్నా, సక్రమంగా వేడి చేయకపోయినా ఆరోగ్యానికి ప్రమాదమే. బియ్యంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం చాలా సులభంగా వచ్చేస్తోంది. అందుకే, వేడి చేసి తింటే విషపదార్థాలు తిన్నట్టే. కాబట్టి జాగ్రత్త.
Also Read: రిలీజుకు రెడీ అవుతున్న ‘అవతార్ 2’.. డేట్ ఫిక్స్..!