https://oktelugu.com/

Health News: రాత్రి 9 తర్వాత భోజనం తింటున్నారా.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Health News: మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. వైద్య నిపుణులు రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నా చాలామంది ఈ నియమనిబంధనలను పట్టించుకోవడం లేదు. రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా ఆహారం తీసుకోవడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 4, 2022 / 08:40 AM IST
    Follow us on

    Health News: మనలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. వైద్య నిపుణులు రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నా చాలామంది ఈ నియమనిబంధనలను పట్టించుకోవడం లేదు. రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

    ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రాత్రి 7 గంటల సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆలస్యంగా ఆహారం తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

    రాత్రి సమయంలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల నిద్రాభంగం, గ్యాస్ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అర్ధరాత్రి సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అసిడిటీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రాత్రి సమయంలో ఆహారం తినేవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

    మనలో కొంతమంది వేగంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. భోజనం చేసిన తర్వాత కొంత సమయం నడవటం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకునే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.