మనలో చాలామంది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, బరువు అదుపులో ఉండటానికి ఉదయం సమయంలో రన్నింగ్ చేస్తూ ఉంటారు. రన్నింగ్ చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. రన్నింగ్ చేయడం ద్వారా శరీరానికి శ్రమ దొరకడంతో పాటు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటం సాధ్యమవుతుంది. రన్నింగ్ చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.
Also Read: సిగరెట్ మానేయాలనుకుంటున్నారా.. చేయాల్సిన పనులు ఇవే..?
రన్నింగ్ చేసేవాళ్లు రన్నింగ్ మొదలుపెట్టిన రోజే ఎక్కువ దూరం పరుగెత్తాలని భావిస్తారు. అలా చేయడం వల్ల శరీరంపై ఇంపాక్ట్ పడటంతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తాయి. రన్నింగ్ చేసే సమయంలో విశ్రాంతి యొక్క అవసరాన్ని కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రన్నింగ్ చేసే సమయంలో సరైన షూస్ వేసుకోవాలి. రోజూ రన్నింగ్ చేసే అలవాటు ఉన్నవాళ్లు అప్పుడప్పుడూ ఒకరోజు సెలవు తీసుకోవాలి.
Also Read: భారతీయులకు మరో వ్యాధి ముప్పు.. మద్యం తాగకున్నా..?
స్ట్రెంత్ ట్రెయినింగ్ ద్వారా రన్నింగ్ ను సులభంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రన్నింగ్ చేసేవాళ్లు మరీ వేగంగా రన్నింగ్ చేయకూడదు. రోజు తర్వాత రోజు స్ట్రెంత్ ట్రెయినింగ్ ప్రాక్టీస్ చేయాలి. రన్నింగ్ చేసేవాళ్లు ఆరోగ్యకరమైన పండ్లు, పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. షూస్ వేసుకున్న వెంటనే రన్నింగ్ చేయడండా పది నిమిషాలు ఆగి రన్నింగ్ చేయాలి. అదే పనిగా రన్నింగ్ చేయకుండా మధ్యలో యోగా స్ట్రెచెస్ చేస్తే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రన్నింగ్ చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉండటంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని రన్నింగ్ చేస్తే మంచిది.