Hair Health: ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అందరిని వేధిస్తోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, రాలిపోవడం వంటి ప్రభావాలకు గురవుతున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నలుగురిలో తిరగాలంటే భయపడుతున్నారు. ఇరవైలోనే అరవైలా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంట్రుకల సంరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో పరిహారాలు వాడుకుని సమస్య నుంచి దూరం కావాలని కలలు కంటున్నారు. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు నకిలీ మందులతో నష్టపోతున్నారు. మార్కెట్లో లభించే ఉత్పత్తులను నమ్మడం కుదరదు. మనమే స్వంతంగా తయారు చేసుకుని వాడుకుంటేనే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
జుట్టు తెల్లబడుతుందంటే చాలు హెన్నా రాసుకుంటున్నారు. ఇది స్వచ్ఛమైనది అయితే ఫర్వాలేదు. నకిలీ రసాయనాలు కలిపిందయితే జుట్టు ఊడిపోవడం ఖాయం. దీంతో మనం నకిలీదో అసలుదో అని తెలుసుకుని మరీ వాడుకుంటే మంచిది. లేదంటే మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జుట్టు రాలిపోవడం జరుగుతుంది. అందుకే మార్కెట్లో దొరికే ఉత్పత్తులను నమ్మకండి.
హెన్నా అసలుదో కాదో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అసలు హెన్నా అయితే మైదాకు వాసన స్పష్టంగా వస్తుంది. ఇంకా దాన్ని టేబుల్ మీద పెట్టి గ్లాసుతో రుద్దితో మెత్తగా ఉంటే స్వచ్ఛమైనదని గట్టిగా ఉంటే నకిలీదని గుర్తించాలి. ఇలా హెన్నా పెట్టుకునే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి తెలియదు హెన్నా పెట్టుకుని ఎంత సేపు ఉంచుకోవాలో కూడా తెలియదు.
గోరింటాకు పొడితో పాటు ఒక చెంచా పసుపు, ఆవాల నూనె, ఒక చెంచా మెంతి పొడి, కొంచెం నీరు కలిపి జుట్టుకు రాసుకుంటే మంచి పలితం ఉంటుంది. జుట్టు త్వరగా జిడ్డుగా మారితే హెన్నాను తలకు పట్టించి అరగంట తరువాత తల స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. గోరింటాకు ముల్తానీ మట్టి నీటిలో కలిపి తలకు పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయడం వల్ల హెయిర్ కండిషనర్ వాడినట్లు ఉంటుంది.
రసాయనాలు కలిపిన హెయిర్ డైలు వాడటం వల్ల నష్టాలు వస్తాయి. జుట్టు పొడిబారి త్వరగా పాడవుతుంది. జుట్టును తెల్లగా మారుస్తుంది. దీని వల్ల మనకు సైడ్ ఎఫెక్టులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న వాటినే వాడుకుని మన జుట్టు బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.